పరమేశ్వరమంగళం

పరమేశ్వరమంగళం

చిత్తూరు జిల్లా పుత్తూరు మండల కేంద్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది పరమేశ్వర మంగళం గ్రామం. పరమేశ్వరుడు మా గ్రామానికి శుభం చేకూర్చుతాడనే భావం నుంచి ఈ పేరు వచ్చినట్లు చెబుతారు. దీనికి నిదర్శనంగా మా గ్రామానికి తూర్పున అగస్తరీశ్వరాలయం, ఉత్తరాన పుత్తూరులో పార్వతీ సదాశివేశ్వరాలయం ఉన్నాయి. మా గ్రామానికి ‘పరమేశ్వర మంగలం’ అనే పేరు కూడా ఉంది. మహేశుడు భిక్షాటన చేసి ఆ పాత్రను మా గ్రామంలో ఉంచాడని ప్రతీతి. మా పొలాల చివర్లో చిత్తూరు జిల్లాలోనే ఎత్తయిన ‘నగరి ముక్కు’ కొండ ఉంది. ప్రతి పౌర్ణమి రోజున దీని మీద పెద్ద మంట పెడతారు. కింద నుంచి చూస్తే అది దీపంలా కనిపిస్తుంది. చిన్నతనంలో ఈ కొండ ఎక్కి చూస్తే మా గ్రామం సమీపం నుంచి వెళ్లే రైలుబండి గొంగళిపురుగులా కనిపించేది. విద్యాపరంగా మా గ్రామం బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ అయిదు కళాశాలలున్నాయి. 

- ఇనుగుర్తి గురుస్వామి నాయుడు, పరమేశ్వరమంగళం