రాయపూడి

రాయపూడి

కృష్ణానది తీరాన కరకట్టకు ఆనుకుని ఉన్న రాయపూడి మా ఊరు. వెలనాటి చోళులు, కాకతీయులు పాలించిన ప్రదేశమిది. పదిహేనో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు దక్షిణదేశ దండయాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో నదీతీరంలో విశ్రమించారు. అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించి, ‘రాయపూడి’ పేరు పెట్టారు. ఈ గ్రామంలో వీరభద్రస్వామి ఆలయాన్నీ నిర్మించారు. గుడి ముందు ధ్వజస్తంభం పైన కనిపించే శాసనాలే దీనికి ఆధారం. ఆ ఆలయాన్ని గ్రామస్థులు ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం మా రాయపూడి నవ్యాంధ్ర నూతన రాజధాని ప్రాంతంలో భాగమైంది. భూ సమీకరణలో భాగంగా 90 శాతం భూమిని ప్రజలు తమ రాజధానికి ఇచ్చారు. నిమ్మకాయల వ్యాపారానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. - కె.సాంబశివరావు, రాయపూడి, గుంటూరు జిల్లా