కల్వకోల్‌

కల్వకోల్‌

నాగర్‌కర్నూలు జిల్లాలో ఓ గ్రామం. పూర్వం ‘కైరవకాసాపురం’ అని పిలిచేవాళ్లు. ఊరికి ఈశాన్యంగా కలువపూలకొలను ఉండేది. దాంతో కలువకొలనుగా పిలిచేవారట. జయలక్ష్మీభూపతి అనే ప్రభువు క్రీ.శ.1247లో నందికేశ్వరుని ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయంలో ఏడు శివలింగాలు గిన్నెల్లా ఒకదానిమీదొకటి ఉండేలా అమర్చారు. వాటన్నింటికీ ఒకేసారి అభిషేకం జరిగేలా పానవట్టాలకూ, లింగాలకూ సూక్ష్మరంధ్రాలు చెక్కారు. దుండగుల దాడిలో నంది కొంతభాగం విరిగిపోయింది. వీరభద్రుడి విగ్రహం, రాతిశాసనం, గుడి ముందు మరో నంది, లింగం ఉన్నాయి. ఈ మధ్యే సత్యనారాయణస్వామి విగ్రహం బయల్పడింది.

- నరేష్‌గౌడ్‌ సురగౌని, కల్వకోల్‌