సింగిస్కాన్‌ పేట

సింగిస్కాన్‌ పేట

చారిత్రకంగా ప్రసిద్ధమైన కొండవీడు ప్రాంత మధ్యభాగంలో శోభాయమానంగా నిలిచిన ఎత్తయిన కొండలతో పచ్చగా అలరారుతూ ఉంటుంది మా ఊరు.  దీని అసలు పేరు ‘సింగనసానిపేట’. కొండవీడు రాజాస్థానంలోని మామిడి సింగన, మంత్రిగా ఉన్న మరో సింగనల్లో ఒకరి పేరిట ఏర్పాటైన గ్రామమిది. క్రమేణా ‘సింగిస్కాన్‌పేట’గా మారింది. ప్రస్తుతం దీన్ని ‘చెంగీజ్‌ఖాన్‌పేట’గా పిలిచేవారూ ఉన్నారు! కాకతీయులు, హంపీ విజయనగర ప్రభువులు, గజపతులు, ఆంగ్లేయుల ఏలుబడితో మా గ్రామ చరిత్ర ఇమిడి ఉంది. రాయల పాలనలో కొండవీడు గ్రామానికి శివారు పల్లెగా ఉండేది ఈ సింగిసానిపేట. ఆంధ్రభోజుడి ఆరాధ్యదైవమైన ‘బాలకృష్ణుడి దేవాలయం’ మా గ్రామానికి తలమానికం.

- పి.కృష్ణభార్గవి