గట్టు ఇప్పలపల్లి

గట్టు ఇప్పలపల్లి

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని గ్రామం. షాద్‌నగర్‌ కల్వకుర్తి మార్గంలో ఉంటుంది. పూర్వం భోజరాయలు అనే ఆసామి ఈ ఊరికి సమీపంలోని ఓ పల్లెలో ఉండేవాడట. ఆయనకు తన సోదరుడితో ఏదో విషయమై కలహం రాగా, ఆ ఊరు పరశురామ ప్రీతి అయిందట. తర్వాత ఆ చోటు విడిచి కొత్త ఆవాసాన్ని ఏర్పాటుచేసుకున్నాడట. అది తూర్పున గుట్టలు (గట్లు), పశ్చిమాన ఇప్పచెట్ల మధ్య ఉండటంతో దానికి గట్టు ఇప్పలపల్లి అని పేరుపెట్టారంటారు. జిల్లాల పునర్విభజనకు ముందు మా గ్రామం మహబూబ్‌నగర్‌ జిల్లాలో భాగం

- చింతలపల్లి ఓజస్విదత్త, గట్టు ఇప్పలపల్లి