జోగిపేట‌

జోగిపేట‌

సంగారెడ్డి జిల్లాలోని జోగిపేట‌కి చారిత్ర‌క ప్రాధాన్యం ఉంది. జైనం బాగా వ్యాప్తిలో ఉన్న కాలంలో ఈ ప్రాంతం జైన జోగుల‌కు వ‌స‌తిగా ఉంది. దాంతో ఈ ప్రాంతానికి జోగిపేట అనే పేరొచ్చిందని సుర‌వ‌రం ప్ర‌తాప‌రెడ్డి త‌న ఆంధ్రుల సాంఘిక చ‌రిత్ర‌లో పేర్కొన్నారు. దీనికి నిద‌ర్శ‌నంగా జైన తీర్థంక‌రుల విగ్ర‌హాలు ఇక్క‌డ క‌నిపిస్తాయి. నిజాం నిరంకుశ‌త్వానికి వ్య‌తిరేకంగా ఏర్పాటైన ఆంధ్ర మ‌హాస‌భ మొద‌టి స‌మావేశాలు (1930) జ‌రిగింది జోగిపేట‌లోనే. స్థానిక జోగినాథ ఆల‌యంలో ఉగాదికి ముందు జాత‌రను వైభ‌వంగా నిర్వ‌హిస్తారు. జోగిపేట‌కు నాలుగు వైపులా ప్ర‌వేశ‌ద్వారాలుంటాయి. ప‌ద్దెనిమిదో శ‌తాబ్దంలో అస‌ఫ్‌జాహీలు ఇక్క‌డ గ‌డియారం స్తంభాన్ని నిర్మించారు.

- రాజ‌శేఖ‌ర్‌, జోగిపేట‌