శాలిహుండం

శాలిహుండం

ఇక్కడ జరిపిన తవ్వకాల్లో లభించిన రెండు శంఖులపైన ఉన్న ఆధారాలనుబట్టి ఈ గ్రామం పేరు సాలిపేడిక, లేక సాలిపటక అయి ఉండవచ్చు. సాలి అంటే బియ్యం. పటిక అంటే వాడ. హుండ అనే కళింగ పదం తెలుగులో కొండకు సమానం. అందువల్ల ఇది బియ్యం నిల్వ ఉంచే లేదా అమ్మే స్థలం అయి ఉండొచ్చు. దగ్గర్లో కళింగపట్నం ఓడరేవు ఉండటంతో ఈ వాదనకు బలం చేకూరుతుంది. ఇక్కడ క్రీ.పూ. 3- క్రీ.శ. 3 శతాబ్దాల మధ్య బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్నట్లు శిలాశాసనాలు ఉన్నాయి. ఈ గ్రామం దక్షిణాన వంశధార నదికి సమాంతరంగా తూర్పు, పడమరలుగా ఉన్న రెండు కొండలమీద తాంత్రిక బౌద్ధం ఆనవాళ్లు బయల్పడ్డాయి.

- ఆరవెల్లి అనంతరామన్, శ్రీకాకుళం