ఉప్పుగుండూరు

ఉప్పుగుండూరు

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో, బంగాళాఖాతానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. సముద్రతీర గ్రామాలవాళ్లు తాము పండించిన ఉప్పును మా ఊళ్లో అమ్మేవాళ్లట. ఈ క్రమంలో వాళ్ల నోటినుంచి వచ్చిన ‘ఉప్పు కొనెడి ఊరు’ చివరికి ఉప్పుగుండూరు అయిందని కొందరి అభిప్రాయం. ఇక్కడి నేల కూడా ఉప్పుపేరుకుని ఉంటుంది. అందుకే... ఉప్పుకుంట- ఉప్పుగుండ అనేవే ‘ఉప్పుగుండూరు’ అయి ఉండొచ్చని మరో కథనం. చారిత్రకంగా చూస్తే, క్రీ.శ.12, 13 శతాబ్దాలనాటి శాసనాల్లో ‘ఉప్పుగొండూరు’, క్రీ.శ.1138 నాటి కామచోడ మహారాజు ‘కొణిదెన’ శాసనంలో ‘ఉప్పుగుండూరు’ ప్రస్తావన ఉంది. ‘లవణపాషాణపురం’ అనేది మా ఊరు సంస్కృత నామం. మా ఊరికి మూడుసార్లు ‘ఉత్తమ పంచాయితీ’ గుర్తింపు లభించింది. 

- తెలగతోటి శామ్యూల్, ఉప్పుగుండూరు