సిర్పూర్‌ కాగజ్‌నగర్‌

సిర్పూర్‌ కాగజ్‌నగర్‌

ఆదిలాబాదు జిల్లాలో ప్రాణహిత నది ఒడ్డున ఉన్న ఊరు సూర్యపురం. ఇక్కడ గోండు రాజుల కోట శిథిలావస్థలో ఉంది.  నదికి అవతలి ఒడ్డున చంద్రపురం (మహారాష్ట్ర) ఉంది. ఈ సూర్యపురమే కాలక్రమంలో సిర్పూర్‌గా మారింది. ఈ ఊరికి సమీపంలో కాగితంమిల్లు నెలకొల్పారు. మిల్లు ఉన్న ప్రాంతాన్ని మొదట్లో కొత్తపేట అని పిలిచారు. తర్వాత ‘కాగితమే’ (కాగజ్‌ అంటే కాగితం కదా) ఈ ప్రాంతానికి పేరైంది! సిర్పూర్‌తో కలసి సిర్పూర్‌ కాగజ్‌నగర్‌గా స్థిరపడింది. 

- పెద్దాడ వెంకటేశ్వర్లు, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌