పాట‌

పాట‌

అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ 
ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా 
అందుకో నా లేఖ
నా కనులతో రాశాను 
ఈ మదిలోన దాచాను
1. మిసమిసలాడే వెందుకని
తళతళలాడే వేమిటని (2)
కురులు మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగు తడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో ।।అం।।
2. మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి (2)
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగు తడబడె సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో।।అం।।
3. నీవే పాఠం నేర్పితివి 
నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడిచిపోవుగా ।।అందాల ఓ చిలకా।।
చిత్రం: లేత మనసులు (1966) 
సంగీతం: ఎం.ఎస్‌.విశ్వనాథన్‌ 
గానం: పి.బి.శ్రీనివాస్, సుశీల 
సాహిత్యం: దాశరథి