‘న్యూ’నత

‘న్యూ’నత

ఓ పరిశుద్ధమైన పదహారణాల నూరుపైసల తెలుగాయన సభలో మాట్లాడుతున్నాడు. ఆంగ్లానికి అలవాటు పడిపోయిన ప్రాణం కావడంతో ఆయన నోటివెంట ఆ మాటలే వస్తున్నాయి. దాంతో సభాపతి ‘‘తెలుగులోనే చక్కగా మాట్లాడండి. అందరం తెలుగువాళ్లమే కదా’’ అన్నారు. దాంతో ఆ వక్త ‘ఆలోచించి’ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒక దగ్గర ‘‘తెలుగు కవితలో....’’ అని ఆగి ఆలోచిస్తూన్నాడు. ‘నవ్యత’ అనాలని ప్రయత్నం. తట్టలేదు. ఆంగ్లంలోని ‘న్యూనెస్‌’ అన్న మాట రాబోతుంటే, దానికి ఆనకట్ట కట్టి, తెలుగుకోసం గిజగిజలాడి - అదీ ఇదీ కలిపేసి - ‘‘న్యూనత’’ అన్నాడు. న్యూనెస్, నవ్యత కలిసి- ఇలా ‘న్యూనత’గా మారడంతో సభ గొల్లుమంది

- ఆర్కే