‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ మాటలు
నాన్న చేసే అపాత్రదానాలు అతనికి నచ్చవు. ‘ఎందుకు నాన్నా.. ముందూ వెనకా చూసుకోకుండా అందరికీ సాయం చేస్తూ మోసపోతుంటారు’ అన్న కొడుకుతో ఆ తండ్రి చెప్పే మాటలివి.. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల్ని ప్రకాశ్‌రాజ్ చెప్పినట్టుగానే మీరూ ప్రయత్నిస్తారా!
‘‘చిన్నప్పుడు నాన్నా పులి కథ విన్నప్పుడల్లా నాకు చాలా బాధ అనిపించేదిరా. ఒకబ్బాయి వాళ్ల నాన్నను ఏడిపించటానికి పులి వచ్చిందని రెండు సార్లు అబద్ధం చెప్పాడు. వాళ్ల నాన్న వెళ్లాడు. పులి లేదు. మూడోసారి నిజంగానే పులి వచ్చిందని అబ్బాయి అరిచాడు. అబద్ధం చెబుతున్నాడని నాన్న వెళ్లలేదు. ఈసారి పిల్లాడు లేడు. మూడోసారి కూడా వాళ్ల నాన్న వెళ్లొచ్చు కదరా! ఏమవుతుంది. మోసపోతాం. ఫూల్ అవుతాం. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువా!? ఒరేయ్ తెలివితేటలు వాడాల్సింది అవతలివాణ్ని మోసం చేయడానికో మోసం చేస్తున్నారని తెలుసుకోటానికో కాదు.. పని చేయడానికి అంతే. అంతకుమించి వాటివల్ల ఏం ఉపయోగం లేదు’’
సేకరణ: సిరిచందన, హైదరాబాదు