‘నన్ను దోచుకొందువటే...’ పాటకు పేరడీ

‘నన్ను దోచుకొందువటే...’ పాటకు పేరడీ

పల్లవి:
నన్ను నంజుకొందువటే...
నన్ను నంజుకొందువటే రచనల రాకాసి
నవలలతో చెలరేగుదు నేనే ఓ స్వామీ నాకైనా స్వామీ ।।నన్ను।।
చరణం 1 
చదివింతును నా రచనలు - మెప్పింతును మీ మనసును
కొంతకాలమైనా మరికొంతకాలమైనా ఇంకెంతకాలమైనా
ఎంతటి రచయిత్రివొ నా అంతరంగమందు నీవు  
పిచ్చిపిచ్చి రాతలతో నన్నువేపుకొందు
నన్ను నంజుకొందు ।।నన్ను।।
చరణం 2 
ప్రతి రచనను కీర్తిస్తూ... ప్రతి రాతను సవరిస్తూ  
రచయిత్రికి పతిగ వెలిగిపోదు నీవు
ఇక నిలిచిపోదు నీవు
ఏనాటిదొ నా పాపము ఎరుగరాని దౌర్భాగ్యము        
ఎంతటి పగవారికైన కలుగరాని ఖర్మం
పూర్వజన్మశాపం ।।నన్ను।।

(‘గుళేబకావళి కథ’ చిత్రంలోని ‘నన్ను దోచుకొందువటే...’ పాటకు పేరడీ)

 - నెమలిదిన్నె రమణారెడ్డి, అద్దంకి, ప్రకాశం జిల్లా, 95421 29297