మూగమనసులు’ చిత్రంలో సాగిపో హాయిగా... పాటకు పేరడీ

మూగమనసులు’ చిత్రంలో సాగిపో హాయిగా... పాటకు పేరడీ

సాగిపో హాయిగా...
సాగిపో హాయిగా...మెల్లగా             ।। సాగిపో ।।
పసిపాపలా పాకిపో మెల్లగా...మెలమెల్లగా     ।। సాగిపో ।।
చినుకు పడితె రోడ్డుకాస్త తడిసిపోతది
తడిసి తడిసి రోడ్డంతా బురద అవుతది         ।। చినుకు ।।
బురదె మనకు మిగిలిపోవు దారి చివరకు     ।। బురదె ।।
ఆ దారిలోన జారిపడే బాధలెందుకు         ।। సాగిపో ।।
చిన్న పెద్ద గుంతలే రోడ్డంతా చివరంటా         ।। చిన్న ।।
బాగుపడే రోజురాదు ఏనాడూ
యెళ్లినోళ్లందరూ గొప్పోళ్లు
నడిచెళ్లినోళ్లందరూ గొప్పోళ్లు
మనం నడవాలి
గొప్పోళ్ల అడుగుజాడలో
సాగిపో హాయిగా మెల్లగా
పసిపాపలా పాకిపో
మెల్లగా... మెలమెల్లగా.....సాగిపో

- డా।। యిమ్మిడిశెట్టి చక్రపాణి, అనకాపల్లి, 98493 31554