చెబితే నమ్మరు!
వెంగళప్ప: ఎక్కడుంటావు నువ్వు?
వెంకీ: అమ్మానాన్నలతో
వెంగళప్ప: వాళ్లెక్కడ ఉంటారు?
వెంకీ: నాతోనే
వెంగళప్ప: మీరంతా ఎక్కడుంటారు?
వెంకీ: కలిసే ఉంటాం
వెంగళప్ప: ఒరేయ్.. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడ్రా బాబూ?
వెంకీ: రవిగాడి ఇంటిపక్కనే
వెంగళప్ప: వాడిల్లు ఎక్కడ?
వెంకీ: చెబితే మీరు నమ్మరు
వెంగళప్ప: చెప్పరా బాబూ.. పుణ్యముంటుంది
వెంకీ: మా ఇంటి పక్కనే..
వెంగళప్ప: వాఁ...!!!!!
- సరిత