‘ఆటోనగర్ సూర్య’ చిత్రంలో నాగచైతన్యలా మాటలు..
ఆటోనగర్‌లో ఎవరు పనిచేసుకోవాలన్నా యూనియన్ సభ్యత్వం తీసుకుని రక్షణ రుసుము కట్టాలి. ఆ డబ్బంతా ఎటుపోతోంది? ఎవరి చేతిలో ఉంది? అడిగేవారే లేరు. ఏళ్లుగా సాగుతున్న ఆ దోపిడీకి ఎదురు తిరిగాడు కథానాయకుడు. దాని గురించి అందరిలో కదలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశాడు. ఈ నేపథ్యంగా ‘ఆటోనగర్ సూర్య’ చిత్రం కోసం దేవ కట్టా రాసిన సంభాషణల్ని నాగచైతన్యలా మీరూ ఆవేశంగా చెబుతారా...
‘‘మీలో సగంమంది నేనేమిట్లో అని ఆలోచిస్తున్నారు కానీ నా వల్ల మీకొచ్చిన సమస్యేంటని ఆలోచించడంలేదు. నాకు తెలిసి మనుషుల్లో నాలుగే జాతులున్నాయి. తినేదానికన్నా ఎక్కువ పండించేవాడు. కనీసం తిన్నంత మాత్రం పండించేవాడు. పండించే కెపాసిటీలేక అడుక్కుతినేవాడు. ఈ ముగ్గుర్నీ దోచుకుతినే నాలుగో జాతొకటుంది... లోఫర్ జాతి. సిస్టం మొత్తం ఆ లోఫర్ జాతి చేతిలో పెట్టి బతుకుతున్నాం. ఈ కాంపౌండ్‌లో కేవలం పనిచేసి బతకడానికి పదివేల నుంచి లక్షదాకా కట్టిన లక్ష మంది యూనియన్ మెంబర్లున్నారు. ఆ లక్షలన్నీ ఎవరిచేతిలో ఉన్నాయి? ఎందుకున్నాయ్? ఏంచేస్తున్నాయ్? అని తెలిసేవరకు నేను మెంబర్ని కాను, నా వ్యాపారం ఆపను. ప్రొటెక్షన్ పేరుతో గల్లా గల్లా మీద కర్చీఫులు పర్చి సంవత్సరానికి ఇరవై కోట్లు వసూలూ చేస్తున్నారు. ఆ ప్రొటెక్షన్ ఎవరి నుంచి కావాలి, ఎందుకు కావాలి? అని తెలిసే వరకు నా గల్లా నుంచి పైసారాల్చను. వ్యాపారం ఆపను. యూనియన్లు, సొసైటీలు అంటూ వసూళ్లు చేయడం, బినామీ పేర్లతో దొబ్బుకుతినడం, దొబ్బిన డబ్బులే మళ్లీ వడ్డీకి, చక్రవడ్డీకి తిప్పి మీ బతుకుల్ని బాండ్ పేపర్‌కు గుచ్చి బానిసల్లా ఈడుస్తున్నారు. వింతేంటంటే బాబాయ్, మీరు సంతకం పెట్టిన బాండ్ పేపర్ కూడా ఆ ..... కాదు. ఇదీ ఆరేళ్ల పసోడిలా ఆలోచిస్తే అర్థమయ్యే ఆటోనగర్. మీరంతా పెరిగిపోయారు బాబాయ్. నిజానికి దూరంగా పారిపోయారు. చేసిన కష్టాన్ని లోఫర్గాళ్ల చేతుల్లో పెట్టి దేవుడా మమ్మల్ని కాపాడు అంటూ విగ్రహాల చుట్టూ బస్కీలు తీస్తున్నారు. నేనింకా ఆరేళ్ల పసోణ్నే. మనిషే వ్యవస్థ అని నమ్మి తిరుగుతున్న ఆరేళ్ల పసోణ్ని’’
సేకరణ: ప్రసాద్