‘నేను లోకల్‌’ చిత్రంలో నానీ మాట‌లు..

‘నేను లోకల్‌’ చిత్రంలో నానీ మాట‌లు..

ఆమె అంటే అతనికి బోలెడు ఇష్టం. నేరుగా ఆ మాట చెప్పలేడు.. అలా అని మనసులో దాచుకోలేడు. అందుకే ఇష్టసఖి నిద్రపోతున్నప్పుడు తన మనసును ఆమె ముందు ఇలా పరిచాడు. ‘నేను లోకల్‌’ చిత్రం కోసం ప్రసన్నకుమార్‌ బెజవాడ రాసిన ఈ మాటలను నానీ చెప్పినట్టు మీరూ ప్రేమగా చెబుతారా..? 
      ‘‘మనమేదో పొట్టి పొట్టి అంటాం కానీ, మంచి హైటే ఇది. బంగారం.. మచ్చేసుకుని పుట్టాం కాబట్టి సరిపోయింది గానీ లేకపోతే..! నువ్విలా నిద్రపోతూంటే చూడటం ఇదే ఫస్ట్‌ టైం. కుక్కపిల్లా భలే పడుకున్నావే.. చాలా విషయాలు చెప్పాలే పొట్టి.. రాత్రి తొమ్మిదింటికే మంచం ఎక్కేస్తాను.. అయినా రెండింటిదాకా నిద్ర పట్టట్లా. లోపల అదో రకమైన ఫీలింగ్‌.. బెంగ వచ్చేస్తోందే.. నిన్ను చూడగానే గట్టిగా పట్టుకోవాలని ఉంటది కానీ పట్టుకోలేం. వంద కిలోల బరువు గుండెల మీద పెట్టుకుని మోస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది వరకు ఎప్పుడైనా లవ్‌ సాంగ్స్‌ వింటే ఏంటీ ఈ సోది? ఈ గోలా? అనిపించేది. కానీ ఇప్పుడు అవే లవ్‌ సాంగ్స్‌ వింటుంటే ఆ లిరిక్స్‌ నాకోసమే రాసినట్టు, నేనే రాసినట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో ఒక స్ట్రక్చర్, సెంటెన్స్‌ ఫార్మేషన్‌ లేదని అర్థమవుతోంది.. లోపల ఫీలింగ్స్‌ కూడా అలాగే ఉన్నాయే! పెళ్లి చేసుకుందామే..! మన పెళ్లి కోసం డెకరేట్‌ చేసిన కారులో నిన్నెక్కించుకుని ఊరంతా తిప్పాలని ఉంది. మా లలిత పిన్ని నీ జడ ఎత్తిపట్టుకుంటే నీకు తాళి కడుతూ ఫొటోగ్రాఫర్‌కి ఒక స్మైల్‌ ఇవ్వాలని ఉంది. కూరలో ఉప్పు ఎందుకు తక్కువైందే అని రోజూ నిన్ను తిట్టాలని ఉంది.. మెటర్నిటీ వార్డు బయట వెయిట్‌ చేస్తూ అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అబ్బాయి పుడతాడా? అని ఓ.. కంగారుపడిపోవాలని ఉంది. ఇన్నీ సార్లు ఏవే, ఏంటే అంటున్నానని ఏమీ అనుకోకు. మా నాన్న కూడా మా అమ్మని అలాగే అంటాడు. నాకు అలాగే ఇష్టం. (ఇప్పటిదాకా నా వైఫ్‌ను నేనే టచ్‌ చేయలేదు. నువ్వేంటే కుడుతున్నావా? బుగ్గ బాగుందని ముద్దు పెట్టేస్తున్నావా? పరాయివాడి పెళ్లాన్ని టచ్‌ చేయకూడదని సెన్స్‌ లేదు మీ జాతికి! అద్దీ.. మనమేదో ఫ్లోలో ఉంటే డిస్టర్బ్‌ చేస్తుంది) లేటయిపోతుంది.. ఇంతకంటే ఇంపార్టెంట్‌ విషయం ఒకటి ఉంది.. ఇప్పుడే వస్తా... ’’