కథావిజయం 2019 పోటీలకు అనూహ్య స్పందన

రామోజీ ఫౌండేషన్‌ ఆహ్వానానికి స్పందించి ‘కథావిజయం- 2019’ పోటీకి కథలు పంపిన రచయితలకు ధన్యవాదాలు. ఈ పోటీకి కథలు వెల్లువెత్తాయి. 14 రాష్ట్రాలు, 4 దేశాల నుంచి మొత్తం 1991 కథలు వచ్చాయి. 18 నుంచి 90 ఏళ్ల వరకూ అన్ని వయోవర్గాల వారూ సమధిక ఉత్సాహంతో రచనలు పంపారు. ప్రాథమిక పరిశీలనలో 264 కథలు ఎంపికయ్యాయి. మలి దశ, తుది పరిశీలన అనంతరం ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తాము. విజేతల వివరాలను ఈనాడు, ఈటీవీ, తెలుగువెలుగు పత్రిక - వెబ్‌సైటులలో, విపుల, ఈఎఫ్‌ఎంలలో ప్రకటిస్తాము.