ట్రంకుపెట్టె

  • 206 Views
  • 0Likes
  • Like
  • Article Share

అది వాళ్ల అరవయ్యో పెళ్లిరోజు. పొద్దున్నే లేచి తల స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్నారు. ఇద్దరూ కలిసి గుడికెళ్లారు. మరో పద్దెనిమిది పెళ్లిరోజులు ఇలాగే జరుపుకోవాలని దేవుణ్ని ప్రార్థించాడతను. అప్పటికి అతనికి నూరేళ్లు నిండుతాయి. మరో ఇరవై రెండు పెళ్లిరోజులు జరుపుకోవాలని ఆమె కోరుకుంది. అప్పటికి ఆమెకి నూరేళ్లు వస్తాయి. అలా మొక్కుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నారు. స్వామికి కొట్టిన టెంకాయ చిప్ప ప్రసాదాన్ని అతనికి పెడదామని అలా రాయికేసి కొట్టిందో లేదో, ఆమె పక్కకి ఒరిగిపోయింది. అతను కంగారుపడుతూ వెంటనే ఆస్పత్రిలో చేర్చాడు. 
‘‘ఇంకెంతో కాలం బతకదు. ఉన్నన్నిరోజులూ ఆనందంగా చూసుకోండి’’ అని చెప్పాడు డాక్టరు. ఆమెని ఇంటికి తీసుకొచ్చి జాగ్రత్తగా సపర్యలు చేయసాగాడు. అప్పడప్పుడూ ఆమె కళ్లలోకి చూస్తూ, ‘దాపరికం లేని కళ్లు’ అనుకునేవాడు. నిజానికీ ఆమె అతని దగ్గర ఏ విషయమూ దాయలేదు, ఒక్క ట్రంకుపెట్టె గురించి తప్ప. ఆ విషయం ప్రస్తావించవద్దని, దాన్ని ముట్టుకోవద్దని ఆమె చెప్పడంతో అతను ఎన్నడూ ఆ పెట్టె జోలికి పోలేదు. ఇప్పుడు అది గుర్తొచ్చి ఆమెనడిగితే తెరచి చూడమంది. అటక మీద నుంచి దాన్ని కిందకి దించాడు. 
చూస్తే అందులో రెండు ఊలు స్వెటర్లు, రూ.మూడు లక్షలు ఉన్నాయి.
‘‘ఈ స్వెటర్లేంటి?’’ అనడిగాడు. ఆమె దీర్ఘంగా నిట్టూర్చి ‘‘పెళ్లయిన తర్వాత నేను మీతోపాటు ఇక్కడికి వచ్చేటప్పుడు మా నాయనమ్మ ఒక విషయం చెప్పింది, ‘భర్తతో ఎప్పుడూ పోట్లాడకు. ఒకవేళ అతని చేష్టలకి పోట్లాడాలన్నంత కోపం వస్తే స్వెటర్‌ అల్లుతూ కూర్చో. కోపం అదే తగ్గిపోతుంది’ అంది. ఆమె చెప్పినట్లే ఇన్నాళ్లూ చేశాను’’ అన్నదామె. 
ఆ మాటలకి అతనికి చాలా ఆనందం కలిగింది. ‘అరవై ఏళ్ల వైవాహిక జీవితంలో ఆమె నాతో పోట్లాడాలనుకున్నది రెండేసార్లన్నమాట. నేనెంత గొప్పవాణ్ని’ అనుకున్నాడు. 
‘‘మరి ఈ డబ్బేంటి. ఇంత  ఎక్కడిది?’’ అనడిగాడు. 
‘‘అదీ... ఈ అరవై ఏళ్లలో స్వెటర్లు అమ్మగా వచ్చిన డబ్బు’’ అందామె.
అంతే... అతని కళ్లు బైర్లుకమ్మాయి!

    - సేకరణ: వల్లూరు దాలినాయుడు, బొద్దూరు, శ్రీకాకుళం జిల్లా
 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


నాటకాలాయనింట్లో పాము

నాటకాలాయనింట్లో పాము

చంద్రశేఖర్‌ ఇండ్ల


అటకెక్కిన రచయిత

అటకెక్కిన రచయిత

నారంశెట్టి ఉమామహేశ్వరరావు


శిల్పి (కథాపారిజాతం)

శిల్పి (కథాపారిజాతం)

అందె నారాయణస్వామి


చెన్నుడి రసికత

చెన్నుడి రసికత

కల్లూరు రాఘవేంద్రరావు



bal bharatam