ఈనాడు కథల పోటీకి ఆహ్వానం

  • 18179 Views
  • 443Likes
  • Like
  • Article Share

తెలుగు కథకు నీరాజనం... కథా విజయం 2020

తెలుగువెలుగు, బాలభారతం, విపుల, చతుర మాసపత్రికల ద్వారా మన అమ్మ భాషకు, సాహిత్యానికి పట్టం కడుతున్న రామోజీ ఫౌండేషన్, రచయితల్ని ప్రోత్సహించేందుకు కథావిజయం పేరుతో పోటీలకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. 2019లో మొదలైన ఈ పోటీలకు అనూహ్య స్పందన వచ్చింది. ఆ ఒరవడిని కొనసాగిస్తూ ‘కథా విజయం 2020’ పోటీలకు రచనలను ఆహ్వానిస్తున్నాము. ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈ.ఎఫ్‌.ఎం, ఉషాకిరణ్‌ మూవీస్‌ సంస్థలు ఈ యజ్ఞంలో భాగస్వాములుగా వ్యవహరిస్తాయి.
బహుమతులు:
* ప్రథమ: ఒక అత్యుత్తమ కథకు: రూ.25,000
* ద్వితీయ: 2 ఉత్తమ కథలకు ఒక్కోదానికి రూ.15 వేలు
* తృతీయ: రూ.10 వేల చొప్పున 3 బహుమతులు
* ప్రత్యేకం: రూ.5 వేల చొప్పున 5 బహుమతులు
* ప్రోత్సాహక: రూ.3 వేల చొప్పున 20 బహుమతులు
* కథల సమర్పణకు తుది గడువు: డిసెంబరు 31, 2020
* మీ కథను kathavijayam@ramojifoundation.org కు మెయిల్ చేయవచ్చు. లేదా..

మీ కథను ఇక్కడ సమర్పించండి (submit your story here)
అంగీకార పత్రం (పీడీఎఫ్)
అంగీకార పత్రం (యూనికోడ్)

నిబంధనలు:

* కథ 2500 పదాలకు మించకూడదు. తెలుగువెలుగు.ఇన్‌లో నిర్దేశించిన లింక్‌ ద్వారా కథ పంపవచ్చు. లేదా నిర్దేశిత అంగీకారపత్రం జోడించిన కథను kathavijayam@ramojifoundation.org కు మెయిల్ చేయవచ్చు. డీటీపీ చేసిన లేదా యూనీకోడ్ లో కంపోజ్ చేసిన కథలను మాత్రమే మెయిల్ చేయాలి. రాసి స్కాన్ చేసిన/ ఫొటో తీసి పంపే కథలను (చేతి రాత కథలను) పోటీకి స్వీకరించడం సాధ్యం కాదు. తపాలా, వాట్సప్ ల్లో పంపే కథలనూ పరిశీలించడం సాధ్యం కాదు.

* కథ మీద రచయిత పేరు, వివరాలు ఉండకూడదు. తెలుగువెలుగు.ఇన్‌ ద్వారా కథను పంపేటప్పుడు అక్కడే మీ పేరు, ఇతర వివరాలు నమోదు చేయడానికి విడివిడిగా నిర్దేశిత ప్రదేశాలుంటాయి. వాటిలో మీ కథ పేరు, ఇతర వివరాలు నింపాలి. అక్కడే అంగీకారపత్రమూ ఉంటుంది. దాన్ని టిక్ చేయాలి. మెయిల్ ద్వారా కథ పంపేవారు పైన పీడీఎఫ్/ యూనికోడ్ లలోఅందుబాటులో ఉన్న అంగీకార పత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని నింపి కథతో పాటు పంపాలి. ఈ అంగీకారపత్రంలో తప్ప కథ లో రచయిత పేరు, వివరాలు ఉండకూడదు.

* రచనలో తెలుగు నుడికారం ఉట్టిపడాలి. కథలు మూసపద్ధతిలో ఉండకూడదు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా వస్తువు నవ్యంగా ఉండాలి. కథ పాఠకుల మీద గాఢమైన ముద్రవేయాలి. కులం, మతం, ప్రాంతం, స్త్రీలు, వైకల్యాలను కించపరిచే పదజాలం, భావాలు ఉండకూడదు.

* ఒకరు రెండు కథలకు మించి పంపకూడదు.

* గతంలో ఎక్కడైనా, ఏ రూపంలో అయినా ప్రచురితమైనవి, చోరీ కథలను పంపకూడదు. ఇలాంటి కథను పంపిన రచయితల పేర్లు, వివరాలను మా పత్రికల్లో ప్రకటిస్తాము. రామోజీ గ్రూపు సంస్థల సిబ్బంది ఈ పోటీలో పాల్గొనకూడదు.

* పోటీ ఫలితాలను ఈనాడు దినపత్రిక, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈనాడు.నెట్, ఈనాడు ఎఫ్‌.ఎంలలో వెల్లడిస్తాము. ఎంపికైన కథలను ఈనాడు ఆదివారం అనుబంధం, తెలుగువెలుగు, విపుల, చతుర పత్రికల్లో ఎందులోనైనా వీలువెంబడి ప్రచురిస్తాము.

* పోటీకి సంబంధించి ఎలాంటి విచారణలు, ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

* నియమ నిబంధనలను ముందుగా తెలియజేయకుండా మార్చే, లేదా పోటీలను రద్దు చేసే అధికారం నిర్వాహకులకు ఉంటుంది.

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


కాలాలు మారాయా?

కాలాలు మారాయా?

బృంద తంగిరాల


ఇల్లు క‌ట్టి చూడు

ఇల్లు క‌ట్టి చూడు

పొత్తూరి విజయలక్ష్మిbal bharatam