అమ్మ జ్ఞాపకం

  • 376 Views
  • 9Likes
  • Like
  • Article Share

    పి.దిన‌క‌ర్ రెడ్డి

  • రాయ‌చోటి, క‌డ‌ప‌.
  • 9985493579

ఇల్లు ఖాళీగా ఉంది. మనసులో శూన్యం ఆవరించింది.
అమ్మా అని బాధతో మూలిగాను. కళ్ల నుంచి ధారాపాతంగా కన్నీరు కారుతోంది.
అమ్మ లేదు. ఎన్నో సమస్యలతో పోరాడి అమ్మ శాశ్వత నిద్రలోకి జారుకుంది.
పెద్దయ్యాక అమ్మతో ఒక్క ఫొటో కూడా దిగలేదు. అన్నీ చిన్నప్పటి ఫొటోలే. ‘నా చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉన్నా కూడా ఎందుకు అమ్మతో ఒక్క సెల్ఫీ కూడా దిగలేదు. ఆ ఆలోచన ఒక్కసారి కూడా ఎందుకు రాలేదు. మా అమ్మే కదా అనుకున్నానా? నన్ను వదలి అమ్మ ఎక్కడికి పోతుందిలే అని ధైర్యం వహించానా? ప్రతి క్షణం మనసుని మెలిపెడుతున్న బాధ.
వంట గదిలోకి వెళ్లాను. పోపుల పెట్టె కనిపించింది.
నేను ఉద్యోగం చేస్తున్నా, ఇంటికొచ్చినప్పుడల్లా ఆ పోపుల పెట్టె నుంచి అమ్మ డబ్బులు తీసిచ్చేది. 
‘‘ఎందుకమ్మా. నా దగ్గర ఉన్నాయి’’ అని చెప్పినా వినకుండా, ‘‘ఆటో ఛార్జీలకైనా తీసుకోరా. చిల్లర నోట్లు అవసరం అవుతాయి’’ అని బలవంతంగా జేబులో కుక్కేది.
అనుక్షణం నా గురించే ఆలోచించే అమ్మ అప్యాయతను గుర్తుకు తెచ్చే అక్షయపాత్ర ఆ పోపులపెట్టె. 
అమ్మ జ్ఞాపకంగా ఆ పోపులపెట్టెను తీసుకుని నా బ్యాగులో పెట్టుకున్నాను. 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


పాపమ్మ చెట్టు

పాపమ్మ చెట్టు

లోగిశ లక్ష్మీనాయుడు


తీర‌ని బాకీ

తీర‌ని బాకీ

చెన్నూరి సుదర్శన్


రేపటి బతుకు కోసం...

రేపటి బతుకు కోసం...

పాలకొల్లు రామలింగస్వామి


నవ్వు

నవ్వు

వి.సి.ఎస్‌.ఎస్‌.వి.శ్రీ‌నివాసు


అసంపూర్ణం

అసంపూర్ణం

బొమ్మరాజు దుర్గాప్రసాద్‌


క‌న్నీరు

క‌న్నీరు

శ్రీనివాస్‌ దరెగోనిbal bharatam