పాపాయి-8

  • 367 Views
  • 43Likes
  • Like
  • Article Share

    జగదాంబ పీసపాటి

  • విజ‌య‌వాడ‌
  • 8978300330
జగదాంబ పీసపాటి

ఇక ఇంట్లో నా చుట్టూ గట్టి బందోబస్తు చేసేశారు. పాపాయి అల్లరి హద్దులు మీరిందంటూ ఇంటికొచ్చిన వారందరికీ ఒకటే కథ మళ్లీ మళ్లీ చెబుతారే. 
      విద్వాంసురాలినయిపోయి తొందరగా నిరూపించుకోవాలని అనుకున్నాగా. రాగాలేమో ప్రతిరోజూ సాధన చేస్తున్నా. కానీ ఎవరూ పూర్తిగా వినరే! చేతిలో బిస్కెట్టో చాక్లెట్టో పెట్టేసి నన్ను ఏమార్చేస్తారు.
      మా పక్కింట్లో సీతుందే, దానికయితే పాటలు రాగాలు నేర్చుకోడానికి ఒక టీచర్ని కూడా పెట్టారు. పొద్దున, సాయంత్రం నేర్చుకుంటున్నా, నాలాగ పాడలేకపోతోంది. ఎందుకో మరి, ఎప్పుడూ ఒకటే పాట. సరిగమపదనిస సనిదపమగరిస. దాన్నే మరి సగం చేసి, పావు చేసి, జత చేసి, కొంచెంసేపు లాగి, ఆగి పాడుతుందేగానీ, ఎవ్వరూ దాన్నాపే ప్రయత్నం చెయ్యరు. ఇలా సహకరిస్తే నేనెప్పుడో డాక్టర్‌ అయిపోయేదాన్ని!! 
      సీతకయితే (రాముడి సీత కాదు, మా పక్కింటి సీత) టీచర్‌ వస్తుంది. మరి నాకయితే, ఇంకా చిన్నపిల్లనట. అందుకని అమ్మ పెట్టిన అన్నం తినడం, పడుకోవడం, అల్లరి (నా పనులు నేను చేసుకోవడం అన్న మాట) చేయడం, అంతేట!!
      ఇలా అయితే చాలా ఆలస్యమయిపోతుంది. అందుకని ఏం చేశానో తెలుసా... మా ఇంట్లో ఓ పెట్టుంటుంది. పెట్టంటే బట్టలు సర్దుకుని ఊరెళ్తామే, అది కాదు. ఇస్త్రీకి వాడతామే, అదీ కాదు. అమ్మ తాళం వేసి ఉంచుతుందే, మరి అది కూడా కాదు. ఇది పాటల పెట్టి. అదే టేప్రికార్డర్‌.

 

ఇవీ చ‌ద‌వండి...

 

పాపాయి-1

 

పాపాయి-2

 

పాపాయి-3

 

పాపాయి-4

 

పాపాయి-5

 

పాపాయి-6

 

పాపాయి-7

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam