పాపాయి-9

  • 309 Views
  • 14Likes
  • Like
  • Article Share

    జగదాంబ పీసపాటి

  • విజ‌య‌వాడ‌
  • 8978300330
జగదాంబ పీసపాటి

నన్నేమో సంగీతమాపెయ్యమంటారా... దాన్నేమో ఎప్పుడూ మొట్టికాయలు మొట్టి మొట్టి పాడమంటారు (దాని నెత్తి మీదే కొడతారు, ఎన్నిబొప్పులు కట్టాయనుకున్నారూ). విశ్రాంతి లేకుండా సాధన చేస్తుందా, అందుకే అంత గొప్పగా పాడేస్తుంది మరి. ఆ సీతని కూడా నాలుగు మొట్టికాయలేస్తే అదే కొత్త పాటలు నేర్చుకుంటుంది. నే సలహా ఇస్తాలే!!
      ఆ టేప్‌ రికార్డర్‌తో రోజూ నా సాధన మొదలవుతుంది. ‘కౌసల్యా సుప్రజా’ అంటూ పాడుతుందా, ‘‘రోజూ అదే పాట ఎందుకూ?’’ అని బామ్మని అడిగితే, రాముణ్ని నిద్రలేపటానికంది. మరి రాముణ్ని నిద్రలేపేటట్టయితే కౌసల్యని (రాముడి అమ్మ... నా అమ్మలాగా) ఎందుకుట మొదట పిలవటం? పని చేసీ చేసీ అలసిపోతుంది కదా!!
      ఇప్పుడు నన్ను నిద్రలేపటానికి ‘పాపాయి, పాపాయి’ అని పిలవాలిగానీ ‘కామాక్షి (మా అమ్మ పేరు మారిపోయిందిలే) పాపాయి’  అని పిలుస్తారా??
వీళ్లకి చాలా సంగతులు తెలీవు. చెబుదామంటే వాగుడుకాయంటారు. నాకెందుకులే గొడవ!!
      ఆ పాటలో నాలుగు పదాలు నా తలకెక్కుతాయో లేవో, వెంటనే ‘వార్తలు’ అంటూ మాట్లాడేస్తారు. ఒక రాగం ఉండదు, తాళం ఉండదు, సీత వాళ్ల అమ్మలాగా.. మా అమ్మలా కాదులే. మా అమ్మ మాట్లాడినా పాటలాగా ఉంటుందిలే (నా పోలికే అంటారందరూ!!)
      ఆ మాటలు... అదే, వార్తలు నాకు అర్థంకావులే. ఇంతలో ఓ స్వరం వినిపిస్తుంది. అదచ్చం నా పాత చుట్టాలున్నారే, గంధర్వులు, వాళ్లు పాడతారన్నమాట. కానీ ఇంట్లో అందరేమో అదేదో పేరు ‘సుబ్బులు... ఆ.. సుబ్బులక్ష్మి... ఎం.ఎస్‌’ అంటూంటారు.
      చెప్పాగా, వీళ్లకి బోల్డు విషయాలు తెలియవని. రోజూ ఆవిడకి (ఎం.ఎస్‌) ఒకేలా పాడటం ఎలా కుదురుతుంది. ఓసారి జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, ఇంటికి చుట్టాలొస్తారు... సీత టీచర్‌ కులాగా. అయినా వస్తుందిగా. నేను దీటుగా గొంతు కలిపేస్తా.
      అలా ఎంత మందితో సాధన చేస్తానో. బాలు, సుశీల, బాలమురళీకృష్ణ (ఎంత పెద్ద పేరో!!) నా పేరూ అంతే, ఉత్త పాపాయి అనుకున్నారు కదూ. కాదు కాదు. చాలా పొడుగు. ‘వీర వేంకట సత్య సాయి దుర్గానాగ లలితా త్రిపురసుందరి’. ఇప్పుడు ‘పాపాయి’ అన్నమాట.
      బామ్మ, అమ్మమ్మ, అమ్మ అందరి మొక్కులు చేరి ఇంత పొడుగన్నమాట. అందుకే కాబోలు, అమ్మ నన్ను అస్తమాను ‘నా వరాల మూట’ అంటూంటుంది.
      సరే, అస్తమానూ పాడుతూ ఉంటారే, వాళ్లు కూడానూ గంధర్వుల చుట్టాలు కాబోలు. అన్ని గొంతుల్లో ఒకే మాధుర్యం, నా గొంతులో కొంచెం ఎక్కువ. నాకు మరీ దగ్గరి చుట్టరికం కదా.

 

ఇవీ చ‌ద‌వండి...

 

పాపాయి-1

 

పాపాయి-2

 

పాపాయి-3

 

పాపాయి-4

 

పాపాయి-5

 

పాపాయి-6

 

పాపాయి-7

 

పాపాయి-8

 

 

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


వాళ్లు ఏడ్చారు!

వాళ్లు ఏడ్చారు!

పి.చంద్రశేఖర అజాద్‌


స్వ‌యంవ‌ధూ...!?

స్వ‌యంవ‌ధూ...!?

దోరవేటి, (వి.చెన్నయ్య)


సువర్ణ గన్నేరు పూలు

సువర్ణ గన్నేరు పూలు

ప్రసాదమూర్తి


స‌మిధ‌

స‌మిధ‌

సయ్యద్‌ సలీం


అతడూ మనిషే!

అతడూ మనిషే!

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


దాసరి పాట (క‌థాపారిజాతం)

దాసరి పాట (క‌థాపారిజాతం)

చింతా దీక్షితులుbal bharatam