'ఈనాడు' క‌థా విజ‌యం ఫ‌లితాలు విడుద‌ల

  • 971 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఈనాడు, రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కథావిజయం-2020’ పోటీకి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి 1500లకు పైగా కథలు అందాయి. మూడు విడతల వడపోత అనంతరం 95 కథలు తుది దశ పరిశీలనకు ఎంపికయ్యాయి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ప్రముఖ కథా రచయిత, విమర్శకులు ఆడెపు లక్ష్మీపతి, ప్రముఖ కథా విమర్శకులు ఎ.వి.రమణమూర్తిల బృందం ఈ కథలను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రథమ, ద్వితీయ బహుమతులకు తగిన కథలు లేవని న్యాయనిర్ణేతలు అభిప్రాయపడ్డారు. తృతీయ, ప్రత్యేక, ప్రోత్సాహక బహుమతులకు మొత్తం 22 కథలను వారు ఎంపిక చేశారు. ఈ కథలు ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో లేదా ‘ఈనాడు.నెట్‌’లలో ప్రచురితమవుతాయి. ఎక్కడ ప్రచురించేదీ విజేతలకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తారు. తృతీయ బహుమతి కథలకు ఒక్కోదానికీ రూ.10 వేలు, ప్రత్యేక బహుమతులు ఒక్కోటీ రూ. 5 వేలు, ప్రోత్సాహక బహుమతులు ఒక్కోటీ రూ. 3 వేలు త్వరలో విజేతల ఖాతాలలో జమచేస్తారు.

 

విజేతలు వీరే...

తృతీయ బహుమతులు - 3
త్రీ కమాండ్మెంట్స్‌ - చరణ్‌ పరిమి,
తూర్పారబోత - డా।। జడా సుబ్బారావు,
అందరికీ వందనాలు - కె.శ్రీఉదయిని

ప్రత్యేక బహుమతులు - 5
కస్తూరీ పరిమళం - రాచపూటి రమేష్‌  
మనిషి - బద్దల రాజారాం
సుక్కల పూట - ఎండపల్లి భారతి
ఎదురుగాలి - శేషచంద్ర
వెలి - డా।। జడా సుబ్బారావు

 

ప్రోత్సాహక బహుమతులు - 14
చీకట్లో అద్దం - వాడపల్లి చంద్రశేఖర వర్మ
 రెక్కలు విరిగిన కాలం - దాట్ల దేవదానం రాజు
 కొల్లేటి సూర్యం - ప్రసాదమూర్తి
 కొనుక్కోవాలి - గంగుల నరసింహారెడ్డి
 సంబంధాలు - వియోగి
 ఉత్తములు - టి.మహమ్మద్‌ రఫి
 వడ్డించిన విస్తరి - సింహప్రసాద్‌
 నాయిన చెప్పిన అబద్ధం - స్ఫూర్తి కందివనం
 తీర్మానం - డా।। సిద్దెంకి యాదగిరి
 కొన్ని చీకట్లూ... ఓ వెలుతురూ - యం.ప్రగతి
 ఒక రైతు కథ - నరెద్దుల రాజారెడ్డి
 రాక్షసీయం - వసుంధర
 అడ్డుగోడ - ఉమా మహేష్‌ ఆచాళ్ల
 మళ్లీ మామూలే.. - తంగెళ్ల రాజగోపాల్‌

వెనక్కి ...

మీ అభిప్రాయం

  కథలు


ముళ్ల గులాబీ

ముళ్ల గులాబీ

పులిగడ్డ విశ్వనాథరావు


కురూపి భార్య (కథాపారిజాతం)

కురూపి భార్య (కథాపారిజాతం)

కొడవటిగంటి కుటుంబరావు


కథ రాసి చూడు...

కథ రాసి చూడు...

పార్థసారథి చిరువోలు


అత్తమ్మ

అత్తమ్మ

కాటబత్తిని రాజేశ్వర్‌


వింగవాజు మామ్మ

వింగవాజు మామ్మ

మ‌న్నం సింధుమాధురిbal bharatam