అలుకు బోనం

  • 970 Views
  • 0Likes

    భైతి దుర్గయ్య

  • రామునిపట్ల, మెదక్‌ జిల్లా
  • 9959007914

కొత్త కుండ తెచ్చి
పసుపన్నం వండి
పలుగు రాళ్లను
కుంకుమతో పూజించి
పువ్వులతో అలంకరించి
నైవేద్యం చూపించి 
మొలకమండె నుంచి 
విప్పిన మొలకలు
రైతన్న చేతుల మీదుగా
పొలాల్లో అలుకుతుంటే
రత్నాలు జాలువారినట్లు
భూమాత పులకరించె
అలికిన మొలకలను
అన్నదాత ఎంతో ఓర్పుగా
ఎండ కాచే వేడికి
వాన చినుకులకు
వణికించే చలి నుంచి
చీడ పురుగుల తాకిడి నుంచి
కంటికి రెప్పలా కాపాడుతూ
పసి పాపలుగా పెంచె
ఎదిగిన నారుని చూసి
పొలం తల్లి పరవశించే
రైతుమోము మెరిసి
రాజోలే మీసం మెలేసే.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌