ఒకసారి ఆ నేలను తాకనీయండి...

  • 1217 Views
  • 2Likes

    పరమాత్మ

  • హైదరాబాదు,
  • 9848552512

పర్వత సానువుల్లో 
కర్పూరం ఆరబోసినట్టు 
మంచుకళికలు అబ్బురపరచేవి
కొండల నుంచి జాలువారే 
నీటిధారల కాంతితీగెలు 
కాలాన్ని కాసేపు కట్టిపడేసేవి
రాత్రంతా మంచుపొయ్యి మీద 
ముదురకాగిన నీటిచెలమలు, 
పొగలతో చురుక్కుమనిపించేవి
రంగుల సీతాకోకచిలుకల
రెక్కల గాలి విసుర్లకు 
గులాబీ రేకులు కందిపోయేవి
పూలతోటల కంచెమీద 
అల్లుకుపోయిన కట్లపూతీగెలు
పొద్దున్నే మంచుముత్యాలు రాల్చేవి
కొత్తగా పెళ్లైన వధూవరులు 
జీలం నది అద్దంలో ముఖాల్ని 
చూసుకుంటూ మురిసిపోయేవాళ్లు
వీధుల్లో కశ్మీరం కన్నెపిల్లలు 
పూలబొకేలు అమ్ముకుంటూ 
నడిచే పూదోటలయ్యేవాళ్ళు
నదుల్లో బతుకమ్మల్లా తేలియాడే 
కుషన్‌ గద్దీల షికారా పడవలు 
పోటీపడి టూరిస్టుల్ని ఆహ్వానించేవి
పూలమకరందాల్ని జుర్రుకున్న 
గండుతుమ్మెదల గుంపులు 
ఝుమ్మని పాడుతుండేవి 
కలియుగ భూతల స్వర్గం 
సుందర స్వప్నాల కశ్మీరం 
వేయివసంతాలు ఆవిష్కరించేది
హోటళ్ల ముందు బగీచాల్లో 
‘‘గరమ్‌ గరమ్‌ చాయ్‌’’ శబ్దాలు 
ఆత్మీయుల్ని ఆహ్వానిస్తున్నట్టుండేవి
ఆకాశాన్నితాకే చీనార్‌ చెట్లు 
ప్రేమికుల మూగ బాసలను 
నీడలపుటల్లో నిక్షిప్తం చేసేవి
గరిక తివాచీమీద మేనువాల్చి 
శ్రీనగర్‌ అందాలు తడుముతోంటే 
మనుషుల పరిమళం చుట్టూరావీచేది
ప్రాకృతిక పరుసవేది శ్రీనగర్‌ 
కొండకొప్పున వెలసిన ఆదిభిక్షువు 
నడయాడిన ఆనవాళ్ళు దొరికేవి
ఏదీ... వనితల నుదుటన 
కుంకుమ దిద్దుకున్నట్టు 
మెరిసి మురిసిన కశ్మీరం
ఎవరి మాటలు నమ్మి దారి తప్పిందో 
జాడతెలిస్తే దొరకబుచ్చుకుని 
తనివిదీరా కౌగిలించుకుంటాను
ఏంచేసిందని నా శ్రీనగరం 
మతోన్మాదం రాళ్ల దెబ్బలకు
నెత్తురోడుతూ బతకాల్సొస్తోంది
ఏం చెప్పిందని నా కశ్మీరం 
తుపాకుల పహరాలోనే
తూటాలుతింటూ గడిపేస్తోంది
నాకొక అవకాశం ఇప్పించండి 
వీధి వీధినా మనుషుల్ని నాటుతా 
గుండె గుండెకింత మనిషితనమద్దుతా 
ఒకసారి ఆ నేలను తాకనీయండి 
స్వేచ్ఛా భారతి హృదయ ఘోష 
మనిషి - మనిషికి రంగరించి పోసొస్తా
ఒకసారి ఆ మనుషుల్ని ముట్టుకోనీయండి 
కట్టలు తెంచుకునే కడుపుసొదలు విని 
మనిషినైతే నిలువునా కరిగిపోతా !

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత