గగన తరుణి

  • 932 Views
  • 1Likes

    కొత్త అనిల్ కుమార్‌

  • పురపాలక గుత్తేదారు,
  • క‌రీంన‌గ‌ర్‌
  • 9395553393
కొత్త అనిల్ కుమార్‌

ఎంత నిర్మొహమాటంగా నడిరోడ్డుపై 
నన్నలా అలుముకుంటావ్‌!

రమ్మన్నప్పుడు రావు కాని
వస్తే వాటేసుకోవడం మాత్రం మానవు
వెనకా ముందూ చూసుకోకుండా వచ్చిపడే
నీ తెగింపు మధురమైన చిరాకు

తడబడకుండా నుదురును ముట్టుకుని
పదునువేళ్లతో వదనాన్ని మొదలుకుని
ఒళ్లంతా మత్తెక్కించే నీ చల్లని స్పర్శతో
లోపలి ఉష్ణమంతా వాయులీనం

కనురెప్పలు చెంపలు చటుక్కున కొరికేస్తూ
తడిమి జారుతూ
పెదవులను చుంబిస్తూ గవదను కొరికేస్తూ
అరచేతులకు దొరకకుండా చల్లగా జారిపోతావు

దిక్కులన్నీ నీకు దారులుగా చేసుకుని
తడిదారాలతో నన్ను చుట్టిపడేసి
ఉరికిస్తూ కదలక మెదలక నిలిపేస్తావ్‌
అత్తారింటి నుంచి వచ్చావని ఆ చనువేమో

ఎవరేమనుకున్నా నాకేమని నేనూ నీతో
కలబడి జలనాట్యం చేసి తడిసి అలసి
ఇల్లు చేరి పొడిబారడం నిట్టూర్పు
నను తడిమి వెళ్లిన వానకన్యక మళ్లీరా...

నా చేతులు చాచి ఆకాశానికేసి చూస్తూ
మనువాడని నీతో ఆడిపాడాలని ఆశతో
వచ్చి వాలిపొమ్మని రమ్మంటున్నాను
గగన తరుణి నువు రావని తెలిసినా...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత