ఒక ఎండు చేప మరొక పాత టైరు

  • 522 Views
  • 0Likes

    ఇంద్రపాల శ్రీనివాస్‌

  • హైద‌రాబాద్‌
  • 9052241005

కలల వాకిట్లో విచ్చుకున్న
ఒంటరి చూపు
కని పెంచుకున్న బాధను
కంటికి రెప్పలా కాపాడుకునే కడుపు
రోజుల మహాపర్వతాలమీద నుంచి ఎన్నిసార్లు దూకినా
కాళ్లు చేతులు విరగని కాలం
కాంక్రీట్‌ కౌగిలిలో
సిగ్గుల సిమెంట్‌
ధరలు పెరిగి దగాపడి ప్రపంచం బొక్కాబోర్లాపడి
మారకపు విలువలు
విదేశీ నిల్వలు
జీవితం ఏ మూల నుంచో చూపే ప్రభావం
ముడిచమురు ముద్దుల్లో
బంగారం బజార్లో
కాలి నడకను కార్లు
ఉప్పొంగిన బీరు ప్రవాహంలో
ఊరు ఎండు చేప
పట్టణం పాతటైరు!
 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


రాత్రి కురిసిన వాన

రాత్రి కురిసిన వాన

పద్మావతి రాంభక్త


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


వృక్షభారతి

వృక్షభారతి

సామ‌లేటి లింగ‌మూర్తి


అమ్మకు పర్యాయం

అమ్మకు పర్యాయం

వై.హెచ్‌.కె.మోహన్‌రావు


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌