నవవర్షం నవరాగం

  • 428 Views
  • 1Likes

    జి.పాండురంగారావు

  • హైద‌రాబాదు
  • 9849372857

కాలాన మళ్ళి మనకళ్ళకు పర్వమాయెన్‌
పూలన్ని విచ్చి మధువుల్‌ మధుపాలకిచ్చెన్‌
ఈలీల కైతలకు యింపునుసొంపు కూర్చెన్‌
కాలావసంతమణి కంతట యాదరంబే

ఈహేవిళంబి మనకిచ్చును అర్థక్రాంతిన్‌
ఆహాయనన్‌ ఇతరులార్థికవేత్తలంతా
బాహాటమై భరతబావుట కీర్తులన్నీ
స్వాహాయగున్‌ నలుపుసారథులాటలన్నీ

ఈహేవిళంబి వినిపించె వసంతరాగం
ఊహాఝరీ స్వరమధూలహరీ సునాదం
స్వాహాయగున్‌ శృతికి అందని రాగనాదం
ఓహోయిదే కుహుకుహూపికకూజితంబౌ

స్వాగతము హేవిళంబికి
ఆగమ నవవర్షహర్ష మధుమాసయుతా
తెగినను మన పరిపాలన
యుగపర్వము భాషయొకటి కలుపును మనలన్‌

స్వాగతము ప్రకృతికాంతకు
స్వాగతమో హేవిళంబి ఆమని సొగసా
ఏగెను శ్రీదుర్ముఖి మరి
సాగును నీ పాలనంబు సరిగమతులన్‌

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


రాత్రి కురిసిన వాన

రాత్రి కురిసిన వాన

పద్మావతి రాంభక్త


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


వృక్షభారతి

వృక్షభారతి

సామ‌లేటి లింగ‌మూర్తి


అమ్మకు పర్యాయం

అమ్మకు పర్యాయం

వై.హెచ్‌.కె.మోహన్‌రావు


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య


తాత

తాత

- బాలసాని కొమురయ్యగౌడ్‌