వృక్షభారతి

  • 587 Views
  • 0Likes

    సామ‌లేటి లింగ‌మూర్తి

  • సిద్ధిపేట‌
  • 9492912155

పూలనిచ్చి దేవపూజలు గావించు
పండ్లు ఫలములెన్నొ ప్రజలకిచ్చు
పక్షిప్రాణికోటి ప్రాణాలు కాపాడు
వృక్షరక్ష కొరకు దీక్షబూను
వానలొచ్చు చెట్ల వల్లను ధరలోన
వానలొచ్చు యిలలొ వనము పెంచ
వానవల్ల నదులు వాగులు వుప్పొంగు
వృక్షరక్ష కొరకు దీక్షబూను
స్వచ్ఛగాలి నిచ్చు స్వచ్ఛవాసనవచ్చు
చెట్లతోనెగాదె చెప్ప నిజము
మంచికోరి జనులు పెంచాలి వృక్షముల్‌
వృక్ష రక్ష కొరకు దీక్షబూను
హెచ్చు చెట్లు నాట వచ్చును వానలు
వానలొస్తె పారు వాగువంక
చెరువు కుంటలన్ని జలముతో నిండును
వృక్ష రక్ష కొరకు దీక్షబూను
చిన్నచిన్న మొక్కె మిన్నగయెదిగియు
ఎంతొమేలు చేయు యెల్ల వేళ
తల్లికన్న మిన్న చల్లగా కాపాడు
వృక్ష రక్ష కొరకు దీక్షబూను

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సుప్రభాతం

సుప్రభాతం

సాంబమూర్తి లండ


ఏమీ రాయని పలకలతో

ఏమీ రాయని పలకలతో

పాయల మురళీకృష్ణ


కన్నీరయిన స్వప్నం

కన్నీరయిన స్వప్నం

డా.వై.రామకృష్ణారావు


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం