హేవిళంబి.. స్వాగతం

  • 417 Views
  • 0Likes

    రాకుమార

  • గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా
  • 9550184758

భావ కవుల గోష్ఠి పంచాంగ శ్రవణంబు
గున్న మావిపైని కోయిలమ్మ
షడ్రుచులను పంచి స్వాగతం పలుకగా
హితము కూర్చ రమ్ము హేవిళంబి
నీతి తప్పి నేతలు అవినీతులవక
అధిక ధరలతోడ జనులు హడలిపోక
ధీర చరితను కలిగిన దేశమందు
సహజ వనరులనుభవించు శక్తినిమ్ము
గతమును తలచుకొనెడు సంగతులు మరచి
నేడు రేపటి సుఖమయ యేడు నెంచి
ఊరువాడయు విహరించు ఊహలందు
కలలు నిజమొంద కదలిరా కల్పవల్లి
మహిని ఆవరించిన పెను మాయలందు
రోజుకో వింతగ తలంచె మోజులెల్ల
శాపగ్రస్త జీవుల మది సంస్కరించి
బ్రతుకు తెరువునిమ్మిక నూత్నవర్షరాజ్ఞి
తెలుగు వెలుగుల లోగిళ్లు తేజరిల్ల 
లబ్దిగ బడసె రెండువేల పదునేడు
విమల మతులై చరించుచు విజ్ఞులగుచు
నరులు నిరతము పరువుగ నడవ వలయు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


రాత్రి కురిసిన వాన

రాత్రి కురిసిన వాన

పద్మావతి రాంభక్త


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


వృక్షభారతి

వృక్షభారతి

సామ‌లేటి లింగ‌మూర్తి


అమ్మకు పర్యాయం

అమ్మకు పర్యాయం

వై.హెచ్‌.కె.మోహన్‌రావు


కన్యాదానం

కన్యాదానం

ఐతా చంద్రయ్య