సంభ్రమం

  • 874 Views
  • 2Likes

    కళ్యాణదుర్గం స్వర్ణలత

  • కర్నూలు
  • 9848626114
కళ్యాణదుర్గం స్వర్ణలత

మనసు పొరలు మందమై అందరూ
తమచుట్టూ కందకాలను తవ్వుకొని
కోటల్ని నిర్మించుకుంటుంటే
రాలినాకులు రాత్రి కురిసిన వానకు
తడిసి చప్పుడు చేయటానికి బద్దకిస్తున్నాయి...

సరిగ్గా అప్పుడే...
పొడిచిన పొద్దుకు చీకటి పరుగెట్టినట్టు
నాలో మొలచిన నీ తలపునకు నిరాశ నిట్టూర్చింది

ప్రవాహంలా సాగే ఆలోచననంతా ఏకంచేస్తూ
నీ పిలుపు నా ప్రతి పలుకులో మురిసింది

నీ దర్శనంలేని కంటి కరవును
అశృవులు తీరుస్తుంటే
నిబ్బరంగా నీ రూపు చూపును తాకింది

చినుకు చినుకు ముడిపడి ప్రవాహమైనట్టు
నీ ప్రతి భావం అలవోకగా అక్షరమౌతోంది

మరొక్కమాట చెప్పనా...
నీవు సంబరానివి
సరిపోల్చలేని సంభ్రమానివి... అంతే...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌