చెమర్చిన కళ్లు

  • 1167 Views
  • 0Likes

    గంజాం భ్రమరాంబ

  • తిరుపతి
  • 9949932918

నా మదిలో
పదిలంగా దాచుకున్న
జ్ఞాపకాల పూలగుత్తులలో

ఎన్నెన్ని ఆప్యాయతల
ప్రేమ పరిమళాలు..
పొత్తిళ్లలో పొదువుకున్నంత
వెచ్చని అనుభూతులు

కంటి నుంచి రాలబోయే కన్నీరు
అమ్మ స్పర్శ తగలగానే
చిరునవ్వుగా ఎలా మారేదో

సతాయించాలని పరుగెత్తుకొచ్చే సమస్యలన్నీ
నాన్నని దాటి రాలేక
ఎలా బిక్కబిక్కమొఖం వేసేవో

అలవికాని అనురాగాన్ని
దాచుకున్న స్నేహాలు
కరిగించిన మనసు పొరలనూ
పెనవేసిన మమతానుబంధాలనూ...

చూపులతోనే సంభాషించి...
చూపులతోనే సంతృప్తి పడి...
చూపులకోసమే విరహపడిన
తొలిప్రేమ తాలుకూ పూలపుప్పొడి...

వంటి.. అనుభూతుల.. పల్లకీలను
మోస్తున్నప్పుడల్లా...
*చెమర్చిన కళ్లు*
జీవితంలోని మాధుర్యాన్ని
గుర్తుచేస్తాయి.
వసివాడని మరువంలా
పరిమళిస్తాయి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ధన్యజీవి

ధన్యజీవి

ఎస్‌.ముర్తుజా


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


ఓటు సంబరాలు

ఓటు సంబరాలు

ఎర్రాప్రగడ రామమూర్తి


హేమంత ఋతుకాంతి

హేమంత ఋతుకాంతి

- నరసింహశర్మ మంత్రాల,


అమ్మ అక్షరాలు 

అమ్మ అక్షరాలు 

- డా।। ఎ.రవీంద్రబాబు


జీవన రుతువు

జీవన రుతువు

డా।। ఎన్‌.గోపి