తేట తెలుగు

  • 1080 Views
  • 2Likes

    విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి

  • పాల్వంచ‌, ఖ‌మ్మం
  • 9490336803

తేటతేట తెనుగు తేనెలూరు తెలుగు
జానపదుల తెలుగు జాను తెలుగు
జావళీల తెనుగు జాజిపూల సొబగు
అన్నమయ్య తెలుగు అచ్చ తెలుగు

అమ్మ నేర్పు తెలుగు అందమైన తెనుగు
శాసనాల తెనుగు శాశ్వతంబు
నన్నపార్యు తెలుగు నవనీత మొలకించు
తిక్కయజ్వు తెనుగు తీపి తెలుపు

అరిగి కలుగునట్టి అమృతమెట్లు ఘనము
భక్తి సుధలు తోడి ముక్తి కంటే
మధుర మంజులమ్ము భాగవత మహిమ
తెలుగు వారికెలను సొంతమోయి

పోత పోసినట్టి పసిడి యౌ పోతన్న
శైలికిలను ఏది సాటి వచ్చు
పదము పదములోన పారవశ్యముగాని
మరియు మాట లేదు మహిని సుమ్ము

తెలుగు వాడి వేడి తేజంబు తెల్పగా
పసిడి వన్నె యంచు పంచగట్టి
అచ్చ తెనుగు పలుకు ఆనందమొలకించ
పలుక వలయు నీవు తెలుగు వాడ.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి