అమ్మ కట్టిన మొలతాడు

  • 1217 Views
  • 52Likes

    గాజుల పవన్‌కుమార్‌

  • తాండూరు, వికార‌బాద్ జిల్లా
  • 9866265005

మా అమ్మ అంగట్లో
నల్లదారం తెచ్చి నడుంకు కట్టేది
ఒక్కోసారి ఎరుపురంగుదీ తెచ్చేది
భూతాలు రావని
భయాలు పోతాయని
కథలుగా చెప్పి
జతలుగా కుట్టేది  
స్నానాలకు నాని బిగుతైనప్పుడు
అప్పటికప్పుడే
కొత్తది కట్టి పాతది కత్తిరించేది
ఆచార సంప్రదాయమో
అపార విశ్వాసమో
దారంపట్ల అమ్మకున్న బీజమది
అమ్మపట్ల దారానికున్న నైజమది  
           *
బుడిబుడి అడుగుల బడినాళ్లల్లో 
చెడ్డీ జారినప్పుడు
వడివడి పరుగుల కాలేజీరోజుల్లో 
ప్యాంటు వదులైనప్పుడు
అమ్మకట్టిన ఆ దారమే.. ఆధారమై
నన్ను పట్టివుంచేది, పైకి నిలిపివుంచేది 
అంగి గుండి ఊడినప్పుడు
కాలు ముల్లు గుచ్చినప్పుడు
కాంటాలు తగిలించుకొని 
దండెమై సాయమందించేది  
         *
అంతర్గతమైన మొలతాడుని
ఆధునికంలో నగిషీలుచెక్కి
నడమున తురుముకుంటున్నా
అంతర్లీనంగా తన ఊడలు, జాడలు
మా అమ్మ కట్టిన దారానివే 

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మా ఊరి చెరువు

మా ఊరి చెరువు

మల్లవెల్లి శ్రీరామప్రసాద్


ఇంటికో బాలచంద్రుడు

ఇంటికో బాలచంద్రుడు

అడిగోపుల వెంకటరత్నమ్‌


సమర సందేశం

సమర సందేశం

శారద ఆవాల


తాజావార్త

తాజావార్త

సి ఎస్‌ రాంబాబు


గగన తరుణి

గగన తరుణి

కొత్త అనిల్ కుమార్‌