కాలం తూనీగ

  • 2255 Views
  • 3Likes

    పరమాత్మ

  • హైదరాబాదు,
  • 9848552512

నిండు పున్నమి రాత్రి
కనుచూపు మేరంతా
విరగబూసిన మల్లెతోటలా ఉంది
నియాన్‌ లైట్ల వెలుగులో
గరికపచ్చ మైదానమంతా
పచ్చలు పొదిగిన పరుపులా ఉంది
అక్కడక్కడ కలియదిరిగె
సీతాకోక చిలుకల గుంపులు
నేలంతా పర్చుకున్న వెండి వెలుగుల్లో
రంగుల హరివిల్లులవుతున్నాయి
రాత్రి దేహమ్మీద
ఏటవాలుగా రాలుతున్న
మంచు ముత్యాలజల్లు
ముగ్ధమనోహరి నవ్వులా ఉంది
చిరుగాలి అలల్లోంచి
రాత్రి జాణ దేహ పరిమళం
మనసు పొరల్ని తాకుతూ
సంతోషపు ఊయలలూపుతుంది
చుట్టూరా ఏకాంతం గది
గదినిండా ఒంటరి విరహిని
అంతటి చల్లని రాత్రినీ
మౌనంగా లొంగదీసుకుంటుంది
రాలుగాయి రాత్రి మాత్రం
ఒక్కోసారి ఉలిక్కిపడి
ఎదలోయలోకి నిటారుగా
ముఖాన్ని కప్పెట్టుకుంటుంది
ఇంకోసారి
నెలవంక చూపులమీదే
మేఘాలదూది తెరలు వాల్చి
చీకటింటి పరాచికాలవుతుంది
మోహంలో తడిసిన
రాత్రి బుగ్గమీద ముద్దుపక్షిని
ఆప్యాయంగా నిమురుకుంటూ
వేయి జన్మల పరవశిని అవుతుంది
ఆవలి తీరంలో కాలం తూనీగ
హెచ్చరికల సరిహద్దులు గీస్తోంటే
ఎప్పుడు కన్నంటుకుంటుందో తెలియదు
ఏరోజుకారోజు ఉదయాన్నే
ముత్తయిదువ ముఖాన మెరిసే
రూపాయి బిళ్లంత బొట్టునై
పగలు కిరీటాన్ని ఎత్తుకుంటుంటాను

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సందడి

సందడి

డా।। బి.వి.ఎన్‌.స్వామి


కచేరీ

కచేరీ

కోడూరి రవి,


ప్రకృతి పలికిన గీత

ప్రకృతి పలికిన గీత

ఎ.ఎస్‌.డి.రవిశంకర్‌


భావకేదారం

భావకేదారం

సూరారం శంకర్‌


అస్తిత్వ పోరు

అస్తిత్వ పోరు

డి.నాగజ్యోతి శేఖర్‌