రాత్రి కురిసిన వాన

  • 1497 Views
  • 0Likes

    పద్మావతి రాంభక్త

  • విశాఖపట్నం
  • 9966307777

రాత్రి కురిసిన వాన
ఆ మొక్కతో ఏదో రహస్యం చెప్పినట్టుంది
మొక్క పూల ముఖంతో కిలకిలా నవ్వింది
మొగ్గ విరిసి పరిమళపు పాటతో
వనమంతా పరుగులు తీసింది

రాత్రి కురిసిన వాన
నేలతో ఏదో గుసగుసలాడినట్టుంది
నేల కమ్మని మట్టివాసనతో గుబాళించింది
విత్తనం మొలకకు పచ్చరంగును పులిమి పైకెత్తింది

రాత్రి కురిసిన వాన
ఎండిన కొమ్మను చినుకు చేతులతో తడిమినట్టుంది
కొమ్మ కొత్తచిగురు తొడుక్కుని కళకళలాడింది
ఆకులు మురికిని కడిగేసుకుని హరితనేత్రాలను మెరిపించాయి

రాత్రి కురిసిన వాన
నా మనసుతో మాత్రం చల్లని కబుర్లు చెప్పింది
నిదురలేవగానే కాస్త కవిత్వం కాగితమంతా ఒలికింది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నాన్న లేడు

నాన్న లేడు

బెల్లంకొండ రవికాంత్‌


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


ఏమో

ఏమో

నందిరాజు శ్రీనివాస్‌


ప్రతిబింబం

ప్రతిబింబం

వారాల ఆనంద్


నా పలుకు పలక కుండా...

నా పలుకు పలక కుండా...

చింతా అప్పలనాయుడు