క‌న‌బ‌డుట లేదు

  • 2507 Views
  • 14Likes

    కోడం పవన్‌కుమార్‌

  • హైదరాబాదు
  • 9849892825

కూయాలని కోయిల‌
కూర్చునే కొమ్మ‌ను వెతుక్కుంటుంది
కాయాల‌ని కాయ‌
కాపుకొచ్చిన చెట్టును వెతుక్కుంటుంది
పూయాల‌ని పువ్వు
పురిటినొప్పులు ప‌డుతున్న మొక్క‌ను
వెతుక్కుంటుంది
మొల‌వాల‌ని మొక్క‌
గుండెత‌డి నేల‌ను వెతుక్కుంటుంది
చెట్టు శ్వాస‌
ఇంటిముందు గురుతు
ఇరుగుపొరుగు ముచ్చ‌ట్ల వేదిక‌
అల‌సిన బాట‌సారి చిరునామా
ఎండ‌వాన‌ల గొడుగు

కాంక్రీట్ జంగిల్‌లో
త‌ప్పిపోయిన ఆప్తుడు

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


సందడి

సందడి

డా।। బి.వి.ఎన్‌.స్వామి


కచేరీ

కచేరీ

కోడూరి రవి,


ప్రకృతి పలికిన గీత

ప్రకృతి పలికిన గీత

ఎ.ఎస్‌.డి.రవిశంకర్‌


భావకేదారం

భావకేదారం

సూరారం శంకర్‌


పరిమళాల పరిష్వంగం

పరిమళాల పరిష్వంగం

అనితాసూరిబాబు