కళాక్షేత్రం కథా కమామిషు

  • 3596 Views
  • 1Likes

    కక్కునూరి శ్రీహరి

  • ఖమ్మం
  • 9949423528

ఓ చల్లని సాయంత్రం సాహితీ సభకు వెళ్లిన నాకు
అక్షర పూమాలల రసరమ్యపు భావనలెన్నో
మనసును కట్టివేసి కదలకుండ చేశాయి
అక్కడ తళుకులీనిన అక్షరాలు, పదాలతో జతకట్టి
ఒయ్యారాలను ఒలికించుకుంటూ...
పెండ్లి పేరంటాలకు ముస్తాబైన అతివలవోలె
అక్షరాలు ఆడంబరంగా, పదాలు  ఒయ్యారంగా
మాటలు మమకారంగా, మత్తుగ గమ్మత్తుగా
వినసొంపుగా, మనసొంపుగా
ఏదూర తీరాలకో నను తీసుకెళ్లాయి
మైమరచిన నా మనసు వెనక్కిరానంది
తీరా ఇంటికెళ్లిన నాకు కవిత్వం రాయాలనే ఆవేశంతో
అమ్ములపొదిలోని అక్షరాలను కుప్పగాపోసి
వరుసగా పేర్చాను, వరుస క్రమంలో ప్రాధాన్యత ఇవ్వలేదని
కొన్ని అలిగి అటకెక్కాయి, కొన్ని రానని మారాం చేశాయి
కొన్ని అర్థమంతా రాయలేదని అల్లరి చేశాయి
బతిమాలి బామాలి చివరకంటా నేనొస్తే...
ఆఖరు వరుసలోని అక్షరాలు అలిగి చిన్నబుచ్చుకున్నాయి
చిన్నచూపు చూశానని గోల చేశాయి
ప్రేమతో లాలించి, పాలించి ఓదార్చిన నాకు 
తీరా ఆ కవిత్వంలోని భావావేశం బాధ కలిగించింది
పట్టువదలని విక్రమార్కుడిలా మళ్లీ మొదలుపెట్టాను
కవిత్వంపై యుద్ధాన్ని!
రాయాలనే తలంపేగాని కవిత్వం రాసిన అనుభవంలేని నేను
రాయగా... రాయగా...
మనసు పొరలలోని పరిమళమేదో నా మనసును తట్టిలేపింది
విల్లంబులవోలె వాణిని, బాణిని నా చేతికిచ్చింది
విజయోస్తని దీవించింది

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


నువ్వెవరూ!

నువ్వెవరూ!

ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌


మనిషి ఎంత మంచివాడో

మనిషి ఎంత మంచివాడో

ఎర్రాప్రగడ రామమూర్తి


నాన్న రుణం

నాన్న రుణం

కొత్త అనిల్‌కుమార్


మా అమ్మ...

మా అమ్మ...

జి.భిక్షం


చీక‌టి దుప్ప‌టి మాటున‌

చీక‌టి దుప్ప‌టి మాటున‌

సి.హెచ్‌.వి.లక్ష్మి


కలల దుప్పటి

కలల దుప్పటి

కస్తల విజయబాబు