అంత‌స్సంగీత స్ర‌వంతి

  • 2976 Views
  • 45Likes

    మల్లారెడ్డి మురళీమోహన్‌

  • బెంగళూరు,
  • 8861184899

రెప్పల పరదాలు పడుతూనే
నల్లని శూన్యంలో ప్రదర్శితమౌతాయి నిశ్శబ్ద
చిత్రాలు
పగటి దృశ్యాల్ని తాగిన కళ్లు
రాత్రి స్వప్నాల్ని వర్షిస్తాయి.
స్వప్నాల తీగెలపై ఆరబెట్టిన మనసు 
పొరలు...
మనసు పొరలకు అంటిన కోర్కెల చెమ్మ...
ఆ చెమ్మలో మెరిసింది,
రాత్రి తెగిపడ్డ నక్షత్రపు వెలుగు
ఊహల్ని నిశ్శబ్దం చిదుముతున్నట్టు,
కొలను దేహంపై తామరాకు తారాడుతున్నట్టు,
నయన గహ్వరాల్లో కలలు విహరిస్తుంటాయి.
ఆకాశం ఊదిన మబ్బు బుడగల్లా,
కొవ్వొత్తి పంపిన కాంతి వార్తల్లా,
మనోస్థితిని ఆవిష్కరిస్తూ
నిద్రలో చీకటి మొగ్గలు వికసిస్తుంటాయి.
వేకువ వారధి తెగి,
వెలుగు ముక్కలు కళ్లపై రాలుతూనే
శిథిల వాస్తవాల వెలుగులోకి తోసి
స్వప్న శకలాలు నీడల్లా నిష్క్రమిస్తాయి.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


మొగ్గలు

మొగ్గలు

డా।। భీంపల్లి శ్రీకాంత్


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


తెలుగు రైతు

తెలుగు రైతు

ఎస్‌.ఆర్‌.పృథ్వి


సోపతి

సోపతి

పొన్నాల బాలయ్య


మా ఊరు- అయిదురెట్లు

మా ఊరు- అయిదురెట్లు

జె.బి.తిరుమలాచార్యులు,


ఆ బాల్యం... నాకిప్పుడు కావాలి

ఆ బాల్యం... నాకిప్పుడు కావాలి

కె.ఆర్‌.లలిత కుమారి