చిరునవ్వుల సవ్వడి

  • 1186 Views
  • 3Likes

    అమూల్య చందు

  • విజయవాడ
  • 9059824800

నా కళ్లల్లో నీ రూపానికి
రెప్పల తాళం వేశా...
వెళ్లగలవా నన్నొదిలి
గులాబీరెక్కల రాగందాటి...
నీ పిలుపుల ఒరవడి
నా గాజుల్లో చొరబడి...
గలగలలాడుతూ చేస్తున్నాయ్‌
చిరునవ్వుల సవ్వడి...
‘నేను... నీ కోసం’ అని రాసిన అక్షరాలు
గుప్పిళ్లు రెండు గుట్టుగా దాచాయ్‌...
అవి నా ప్రేమకు ద్వారాలు
మనసుకు దారిచూపే దీపాలు!
మనసులో ప్రేమ ముగ్గు వేశా. 
నీ చిలిపి నవ్వుల జడివానకు తడవకుండా
నా సిగ్గు మొగ్గల
గొడుగు పట్టా...
మన కలలు కవల పిల్లలు
ఇప్పుడవి నా రెండు కళ్లు
మెరుపు... మైమరపు...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


వాన

వాన

తానా మూర్తి


మామిండ్ల కాలం

మామిండ్ల కాలం

దాసరాజు రామారావు


కృష్ణం వందే!!

కృష్ణం వందే!!

పేరిశెట్ల శివకుమార్