అరచేయి

  • 1172 Views
  • 3Likes

    తగుళ్ల గోపాల్

  • కలకొండ
  • 9505056316

అప్పుడప్పుడూ
అరచేతుల్ని ముద్దాడుకోవాలి
వేలికొసలతో అరచేయి మాట్లాడే
సుతిమెత్తని భాషను ప్రేమించాలి

మంచికి సెల్యుట్‌ చేసిన ఈ అరచేతిని
చెడుకు చెంపవాయించిన ఈ అరచేతిని
అప్పుడప్పుడూ కళ్లకద్దుకొని గర్వపడాలి

అరచేతిని తెల్లకాగితం చేసి
అమ్మ పేరో, ఆకలిగీతమో రాసుకోవాలి
చెట్టుబొమ్మనో, చేను గట్టునో గీసుకోవాలి
కనీసం తెలుగు అక్షరాలైనా రాసి
అమ్మ భాషను బతికించుకోవాలి

అరచేతిని ఆకాశం చేసి
గోరింటాకుతో వెన్నముద్దలు పెట్టి
పండుగపూట చందమామను అతిథిగా పిల్చి
నోటినిండా మాట్లాడుకోవాలి
 
అరచేతిలోనే కదా
మన జాతకమంతా దాక్కున్నది
అరచేతిని పుస్తకంగా చదువుతూ
విడిపోని రేఖల్లా
అందరితో కలిసిపోవడం నేర్చుకోవాలి

అరచేతిని తాకడమంటే
బాల్యాన్ని ఎత్తుకోవడమే!
అరచేతిని ముద్దాడటమంటే
పసిమనసుతో జీవించడమే!!

ఆత్మీయులు నిను వీడలేక
మళ్లీమళ్లీ నీవైపే చూస్తున్నప్పుడు
ఓ సారి వాళ్ల అరచేతిని ముద్దాడిచూడు...
ఒకరి అరచేతిని ముద్దాడటమంటే
అనుబంధాలను అల్లుకోవడమే!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరచేయి

అరచేయి

తగుళ్ల గోపాల్


క్రీస్తు జననం

క్రీస్తు జననం

పచ్చా పెంచలయ్య


మొగ్గలు

మొగ్గలు

డా।। భీంపల్లి శ్రీకాంత్


వంకర టింకర

వంకర టింకర

పర్కపెల్లి యాదగిరి


పొద్దు పొడుచు వేళనే...

పొద్దు పొడుచు వేళనే...

ఎర్రాప్రగడ రామమూర్తి


వాన

వాన

తానా మూర్తి