వసంతశోభ

  • 1018 Views
  • 2Likes

    స్వర్ణలతానాయుడు

  • నోయిడా, ఉత్తరప్రదేశ్‌
  • 958960068

ఇలకు జారవిడిచిన
పుష్ప సౌందర్య సోయగాలు
రాగరంజితాలు పలికించే
జలపాతాలహోరు
కోనకోనకు సుస్వరాలు అందించే
కొండవాగులు
సాగరంలో జలపుష్పాల
గీతికలు, విన్యాసాలు
కోనేటిలో బంగారువన్నెల మీనాల
తుళ్లింతలు!

మావిచివుళ్లుతిని
మత్తెక్కించే కోయిలగానాలు
మలయసమీరాలకు పులకించే మయూర
వింజామరలు
పారిజాత పరిమళాలు.. 
వనమంతా ప్రతిధ్వనించే
వేణుగానాలు.. తుషారరాగాల పల్లకీలో
చిరుగాలుల స్పర్శ
మకరందాలు గోలే
భ్రమరాలు, సీతాకోకలు!

చిలుకల చిలిపితగవులు
చిర్రుబుర్రులు
వింత సుగంధాలు వెదజల్లే
గడ్డిపూలు
తెలిమంచుతెరలలో సుమదళాలపై
హిమబిందువులు
వెన్నెల కౌగిలిలో ఒదిగిన
తామరతంపరలు
తారాతోరణాలు, వెన్నెల దీపాలతో
స్వాగతం!

లేలేత ఉషాకిరణాలతో హారతులు
వినసొంపైన పసిడిపలుకుల
పక్షులకూజిత
పంచవర్ణపద్మాలతో
పారాణిపెట్టుకున్న
ప్రకృతి కన్య
చామంతిపూలతో నలుగు రాసుకుని
అరుణతిలకం నుదుట ధరించిన
వసంతకన్య!

గుండుమల్లెలతో
కాలికిమువ్వలు అలంకరించి
నవమల్లికలతో మెడలో హారం వేసుకుని
చిత్రవర్ణకుసుమాలతో భూదేవిపై
పరచిన తివాచీ
పూదళాలతో అర్చన కోసం నిరీక్షణ
వసంతుడికై ఎదురుచూపులు!

భూమాత మనోఫలకంపై భగవంతుడు వేసిన అమృతతుల్యమైన
వర్ణచిత్రం.. ప్రకృతి
పంచభూతాల పరవశమే వసంతకాలం!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


కలవరం

కలవరం

మౌనశ్రీ మల్లిక్


పొగమంచు

పొగమంచు

విరాగి


రుణానుబంధం

రుణానుబంధం

చెంగల్వల కామేశ్వరి


కొన ఊపిరిలోనైనా

కొన ఊపిరిలోనైనా

డాక్టర్‌ సి.నారాయణరెడ్డి


వరదాయిని దివ్య శుభాంగీ

వరదాయిని దివ్య శుభాంగీ

పుల్లాభట్ల నాగశాంతి స్వరూప


మట్టి అమ్మ

మట్టి అమ్మ

న‌ల్లా న‌ర‌సింహ‌మూర్తి