అమ్మకు పర్యాయం

  • 713 Views
  • 0Likes

    వై.హెచ్‌.కె.మోహన్‌రావు

  • పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా.
  • 9440154114

అమ్మను అనువదిస్తే మట్టే అవుతుంది
ఎందుకంటే
అవనిలో కూడా అమ్మతనమే పరిమళిస్తుంది
అందుకేనేమో
మట్టిని నేలతల్లీ! అంటూ సంబోధిస్తారు
అమ్మలాగే జన్మనిస్తుంది
జన్మ చాలిస్తే ఒడికి చేర్చుకుంటుంది
అందుకే
మట్టి అమ్మను మించిన అమ్మ అనిపిస్తుంది
ఎన్ని అగ్నిపర్వతాలు బుగ్గి చేసినా
పచ్చదనానికి పురుడు పోస్తూనే ఉంటుంది
ఎన్ని ఉప్పెనలు ముంచెత్తినా
చిరునవ్వుకు చిరునామాగానే ఉంటుంది
అవని
బహుశా అమూల్యం కావచ్చు
అందువల్లేమో!
తల్లి వారించినా తల అడ్డం తిప్పుతూ ‘కన్నయ్య’
మట్టిని కడుపులో దాచుకున్నాడు.
‘వామనుడు’ ఒక్క అంగలో
నేలనంతా ఆక్రమించాడు
‘హిరణ్యాక్షుడు’ పిడికెడు కూడా
రాల్చనని మొండికేశాడు
‘సీతమ్మ’ తల్లి చివరి మజిలీగా మట్టినే ఎంచుకుంది
విపత్తులెన్నింటికో వీడ్కోలు పలికిన మట్టి
ఇతిహాసాలకు ఆహ్వానం పలికింది
యుగాలనెన్నో పదిలపరిచిన ధరణి
చారిత్రక మలుపులకు మైలురాళ్లుగా నిలిచింది
అందుకే! మట్టంటే నాకు అపారమైన వాత్సల్యం
మట్టిని పిసుక్కునే వాడి చేతులకు
మట్టినే నమ్ముకున్న వాడి అడుగులకు
శిరసు వంచాలనిపిస్తుంది!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


ఏమీ రాయని పలకలతో

ఏమీ రాయని పలకలతో

పాయల మురళీకృష్ణ


కన్నీరయిన స్వప్నం

కన్నీరయిన స్వప్నం

డా.వై.రామకృష్ణారావు


ఆటలాడు భాష మాటలాడు

ఆటలాడు భాష మాటలాడు

జాగాన సింహాచలం


తెలుగుభాష సోయగం

తెలుగుభాష సోయగం

గుండంపాటి విజయసారధి