మా ఊరి చెరువు

  • 1366 Views
  • 7Likes

    మల్లవెల్లి శ్రీరామప్రసాద్

  • తెలుగు అధ్యాపకుడు
  • తణుకు
  • 9441350260

ఆ రోజుల్లో మా ఊరికి ఆ చెరువే
 ఓ బట్టలుతికే యంత్రం
వేసవి వచ్చిందంటే ఊళ్లో జనాలకీ, పశువులకీ
  అదే పెద్ద ఈత కొలను
చెరువు గట్టంతా చలువ పందిళ్లు వేసినట్టు
  చిక్కని నీడ పరచిన చింత చెట్లు
ఎవరైనా! చుట్టాలొస్తే చెరువుగట్టే
  మంచి పర్యటక కేంద్రం
గట్టెక్కి చూశామా! ఓ పక్క, ఉత్తరాన
  దూరంగా టేకు, మోదుగ, వెదురు వనాలు
మరోపక్క ఊళ్లోకెళ్లే దారిలో
  జామ, ఉసిరి, కొబ్బరి, మామిడి పళ్లతో
వచ్చిపోయేవాళ్లకు విందుకాహ్వానిస్తున్నట్లుండేవి
పల్లాల్లో కంటూ చూస్తే 
పచ్చలు ప్రవహిస్తున్నట్టు పంట పొలాలు
ఎన్ని పక్షులు, ఎన్నెన్ని రకాలు, 
గట్టుమీది చింతలపై వాలి అవి చేసే 
అల్లరి, శబ్దాలు అంతా ఇంతా కాదు.
రోజుకోసారైనా చూడ్డానికి వెళ్లాలనిపించేది
చదువుకొనే పిల్లలకి పరీక్షలు దగ్గరికొచ్చాయా
  ఇక చెరువు గట్టే చదువుల వేదిక
అక్కడి ముత్తాలమ్మ గుడి
అందరి కోరికలు ఈడేర్చే అమ్మవొడి
ఎందుకో తెలీదుగాని చెరువు లేని ఊరినిగాని
ఊరు లేని చెరువునుగాని ఊహించలేం
ఆ చెరువే వేసవి విడిది అదే ఆధ్యాత్మిక కేంద్రం
అదో ప్రశాంత నిలయం 
ఇవన్నీ ఇప్పుడు లేవుగాని
ఊరు, పల్లెగానే ఉన్నందుకు 
అందులో కొన్ని ఆనవాళ్లయినా మిగిలాయి...

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అమ్మలున్నారు కానీ..

అమ్మలున్నారు కానీ..

శైలేష్‌ నిమ్మగడ్డ


వయసెరుగని మనసు!

వయసెరుగని మనసు!

డా॥ దిలావర్‌


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


రావె తటిల్లతా

రావె తటిల్లతా

వీటూరి భాస్కరమ్మ


ఓయ్‌... నిన్నే...

ఓయ్‌... నిన్నే...

కళ్యాణదుర్గం స్వర్ణలత