తెలుగుభాష సోయగం

  • 973 Views
  • 10Likes

    గుండంపాటి విజయసారధి

  • కర్నూలు
  • 9177238069

సముద్ర గర్భం లోంచి
ఎన్ని ముత్యాలను ఏరి
రాశిపోస్తే
అవి తెలుగు అక్షరాలంత
అందంగా ఉంటాయి?
ఆకాశం లోంచి
ఎన్ని నక్షత్రాలను ప్రోగుచేస్తే
అవి తెలుగు పదాలంత
తళుకు లీనుతాయి?
పృథ్విలోని
ఎన్ని సుమగంధాలను సమీకరిస్తే
అవి తెలుగు పద్యమంత
గుబాళిస్తాయి?
ఏ ప్రాచీన భావుకుడి
శిల్ప నైపుణ్యమో
ఈ తెలుగు అక్షరాలు!
ఏ పురాతన రసజ్ఞుడి
భావ చిత్రాలో
ఈ తెలుగు పదాలు!
ఏ చైతన్యకారుడి
మహాద్భుత రచనా కౌశలమో
ఈ తెలుగు వాక్యాలు!
ఎన్ని కోయిలల కుహుకుహు రవాలతో
రంజిల్లుతుందో ఈ తెలుగు వనం
ఎన్ని రసరమ్య వాక్యాలతో
విలసిల్లుతుందో ఈ తెలుగు కవనం
ఎన్ని ముత్యాల ముగ్గులతో
అలరారుతుందో ఈ తెలుగు సదనం
ఎన్ని మాధుర్య రాగాలతో
పరవశింపజేస్తోందో ఈ తెలుగు గానం.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


జ‌ల క‌ల‌

జ‌ల క‌ల‌

సాక హరీష్‌


తేట తెలుగు

తేట తెలుగు

విద్వాన్ గొల్లాపిన్ని నాగ‌రాజ‌శాస్త్రి


పునరపి గీతం!

పునరపి గీతం!

రాళ్లబండి శశిశ్రీ


కాలమవడమంటే

కాలమవడమంటే

జి.రామకృష్ణ


వసంతశోభ

వసంతశోభ

స్వర్ణలతానాయుడు


నీ నీడలో....

నీ నీడలో....

డా॥ దిలావర్‌,