సోపతి

  • 734 Views
  • 7Likes

    పొన్నాల బాలయ్య

  • కరీంనగర్‌
  • 9908906248

నువ్వు శ్రీ నేను = నేను శ్రీ నువ్వు
గుణకార వినిమయ బంధమే సంబంధం
వస్తువు వ్యామోహ లాభాల రాశులమీద
మనుషులు మొత్తం వస్తువులుగా మారడమే విషాదం
లాభనష్టాల హిసాబులు చేసే ద్రోహాలే అనంతం
స్పందిస్తేనే హృదయం; రెండు చేతులు కలిస్తేనే కరచాలనం
ఇదే సంకలన వినిమయ ధర్మం కదా!
అవసరాల కోసం పూసే ప్లాస్టిక్‌ నవ్వు కారాదు సోపతి
నాకు నువ్వెంత దూరమో!
నీకూ నేనంతే దూరం!!
దూరాల మీద భారాల మీద స్నేహం నిలబడవచ్చు
ఘోరాల మీద ద్రోహాల మీద అసలే కాదు
నేను ప్రేమను నెత్తిన బెట్టుకుని సాగే నిస్వార్థ బాటసారిని
ప్రేమను చంపే ఏ ఆయుధం పుట్టలేదు ఈలోకాన!
ప్రేమిస్తూ ప్రేమిస్తూ ప్రపంచవింతవై పరిఢవిల్లవచ్చు
నువ్వు సామ్రాట్‌వు కావచ్చు నేను సహాయకుణ్ని కావచ్చు
అహంకారం అంతెత్తుగా పడగ విప్పి
మానవ సంబంధాలను అనుక్షణం కాటేస్తుంటే..
మానవత్వాలను నిటారుగా నిలిపే నిట్టాడు గుంజరా మైత్రీ!
ధనం దౌలత్‌ ఆస్తి అంతస్తు అధికారపు గర్వపు పొర
మత్తుగా గాలిల తేలిపోయే తెప్పలాంటిది మిత్రమా!
ముండ్ల కంపలు పర్చిన పల్లేరు గాయల దారిల
పచ్చని మల్లెతీగలా వికసించి నీడనిచ్చే జీవకళరా దోస్తి!
బాధల శూలాలు లోతుగా గుచ్చి దేహాన్ని రక్త సిక్తం జేస్తే
గాయాలను మాన్పే ప్రేమ తత్వాల పూత
స్వార్థంతో గుండె కుంచించి ముడ్చుకుపోతే
బతుకంతా త్యాగాల సుగంధాలు వెదజల్లేది స్నేహం
అత్యాశతో కుప్పలు కుప్పలుగా కుత్తుకలు కోస్తావెందుకు
విశ్వమానవ స్నేహదూతవై తలా కొంచెం ప్రేమను పంచు
నేను చందమామనై ముసిముసిగా నవ్వుతుంటా!

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


చిరునవ్వు

చిరునవ్వు

ఆచార్య కడారు వీరారెడ్డి


ప్రతిబింబం

ప్రతిబింబం

వారాల ఆనంద్


కన్నీటి ప్రశ్న

కన్నీటి ప్రశ్న

సుసర్ల శ్యామల


చెరువు...!

చెరువు...!

ఎ.కిశోర్‌బాబు


పాద ధూళి

పాద ధూళి

అందెశ్రీ