పాద ధూళి

  • 1420 Views
  • 0Likes

    అందెశ్రీ

  • హైదరాబాదు
  • 9848560986
అందెశ్రీ

తనను తాను మరిచిపోయినా
అన్ని తానై నడిపెనా
వెన్నలా కరిగిపోయినా
వేణువు గానమాయెనా
వేలకనుల వెలుగు తొనల
రాధ ఎదల రాగ సుధల
మాధువుని పాదధూళినై
మహిలోన మిగిలిపోదునా //తన//
చ: కష్టాలె సుడిగుండాలై
ననుచుట్టు ముట్టినవేళ
గడ్డిపరకనడ్డము గేసి
నను ఒడ్డుకు చేర్చినవాడు
చౌటనేలగానాబతుకు
చతికిలబడిపోయినవేళ
కరస్పర్శల పరుసవేదిగా
స్వర్ణంగమార్చినవాడు
వర్ణించగ చాలదు భాషా
తన సేవకోసమె శ్వాసా  //తన//
చ: జడమైన ఆకృతిలోన
జవసత్వం తానే కాదా
జగమంతనేపయనించ
‘జాగ్రతు’ తానే కాదా!
నీలి కనుల నిశీధిలోన
నిఖిల జగతి ‘స్వప్నం’తానే
కుడిఎడమల కూడలిలోన
సుస్వరాల ‘సుషుప్తి’తానే
‘తురీయ’ స్థితిలోగల సృష్టి
నిష్టకు నిలువెత్తుటద్దముగ  //తన//
చ: అచల, చల ఆత్మదీప్తులా
అలరించుతత్వముతానే
సప్తాచల సమాధిలోన
నిక్షిప్త నిధులుగతానే
పెదాలపై జనించు శబ్దం
పదగమన ప్రాణం తానే
నా తలపుల నదీనదాల
కదలికలా కాలంతానే
పరివ్రాజకయోగముద్రల
ప్రాపంచిక గాఢ నిద్రల  //తన//

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


తిలకం

తిలకం

ముకుందాపురం పెద్దన్న


ఆవల

ఆవల

యామినీదేవి కోడే


గడ్డివాము యనకాల...

గడ్డివాము యనకాల...

సడ్లపల్లె చిదంబరరెడ్డి


ఎన్నిక‌లైపోయాయి

ఎన్నిక‌లైపోయాయి

నడిమింటి నవీన


తను - నేను

తను - నేను

గరిగె రాజేశ్‌


అజ్ఞాతంలో నా పయనం

అజ్ఞాతంలో నా పయనం

ఎం.భానుప్రకాశ్