దుఃఖితుడి చింత

  • 1149 Views
  • 4Likes

    టి.వెంకటేష్

  • కర్నూలు
  • 9985325362

ఇంత రొట్టె ముక్కకోసం
సగం దేహాన్ని
అర్ధ చంద్రుడిలా ఆకాశానికి అతికించిన ఆకలి
ఈ ఎడారి ఖైదు సలుపునుంచి
తెరిపి లేకుండా కురిసే వానలా
ఆమె సన్నిధిలో సేద తీరాలి
ఖర్జూరపు తీపికన్నా
ఆమె మాటల మధురిమను
మనసంతా నింపుకోవాలి
ఈ ఇసుక దిబ్బల సెగలనుంచి
తన మంచు స్పర్శలో
సాంత్వన పొందాలి
పోగొట్టుకున్నదేదో తెలిసిన
ఈ పొడి దేహాన్ని
నదిలాంటి ఆమె ముందు మోకరింపచేయాలి
పిల్లనగ్రోవిలా రాగధుని ఒదిగినట్టు
నిశ్శబ్దపు కౌగిలిలో
లిపి సవ్వడై ఒలకాలి
ఇరువురమూ ఏకమై
సారెపై కుమ్మరి ఒడుపులా
కళాత్మకమవ్వాలి
ఒక పెనవేత
కుంచెలోంచి ఒలికిన రంగుల్లా బొమ్మ కట్టాలి
దూరానికి దగ్గరగా

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


అరుగు

అరుగు

డా.రంకిరెడ్డి రామ‌మోహ‌న‌రావు


మరుపురాని అద్భుతం

మరుపురాని అద్భుతం

శ్రీదేవి సురేష్‌ కుసుమంచి


గౌతమ బుద్ధుడు

గౌతమ బుద్ధుడు

పులుగుర్త పార్థసారథి


ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

ఔను... ఆ శివుడే నా రోల్‌మోడల్‌

పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌


రాగమాలికలు

రాగమాలికలు

డా।। అన్నపురెడ్డి శ్రీరామరెడ్డి


వాళ్ల నుంచి నేను

వాళ్ల నుంచి నేను

చంద్రబోస్‌