తొలకరి

  • 523 Views
  • 0Likes

    నారాయణమూర్తి తాతా

  • కాకినాడ
  • 9298004001

ఎండల్ని నీళ్లల్లో
ముంచాలని
తొలకరి చినుకు
టప్‌మంటూ రాలింది.
మురిసిన మన్ను
ఆనందపు తావిని
మెత్తగా పైకిలేపి
చక్కని చుక్కని దాచేసింది
మట్టి పరిమళానికి
నిద్రోతున్న ప్రాణం
గాలిని పులుముకుని
ఒళ్లు విరుచుకుంటోంది.
తాపపు నేల
తోయపు గాలి
ఆకాశం కింద
కలసి చిందేస్తోంటే
పులకరించిన
రైతన్న
నాగలిపట్టి
నటరాజులా 
పాదం కలిపాడు.

వెనక్కి ...


మీ అభిప్రాయం

  కవితలు


పరిమళాల పరిష్వంగం

పరిమళాల పరిష్వంగం

అనితాసూరిబాబు


నైరూప్య జీవన వర్ణ చిత్రం

నైరూప్య జీవన వర్ణ చిత్రం

ఆనంద్‌ ఎ.వి.బి.ఎస్


రాత్రి కురిసిన వాన

రాత్రి కురిసిన వాన

పద్మావతి రాంభక్త


అచ్చం అచ్చు

అచ్చం అచ్చు

అన్నవరం దేవేందర్‌


వృక్షభారతి

వృక్షభారతి

సామ‌లేటి లింగ‌మూర్తి


అమ్మకు పర్యాయం

అమ్మకు పర్యాయం

వై.హెచ్‌.కె.మోహన్‌రావు